KGF Chapter 2 - 28 Days Collections : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ గ్రాస్ కలెక్షన్స్ వసూళు చేసిన ఈ మూవీ తాజాగా 28వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఇరగదీసింది.
KGF Chapter 2 - 28 Days Collections : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా మొత్తం భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఇరగదీస్తోంది. ఫస్ట్ వీక్‌లోనే అక్కడ బాహుబలి 2 మరియు ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టి దూసుకుపోతోంది. ఓవరాల్‌గా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ గ్రాస్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. నిన్నటితో నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తోంది. అంతేకాదు హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.
మొదటి నాలుగు రోజులు హాలీ డేస్‌ను కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకుంది. ఆ తర్వాత కూడా రోజుకు రూ. 14 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులుపుతూనే ఉంది. ఈ సినిమా 28వ రోజు తెలుగు రాష్ట్రాలలో రూ. 0.11 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా 28వ రోజు ఈ సినిమా రూ. 2.48 కోట్ల షేర్ (రూ. 6.15 కోట్ల గ్రాస్) వసూళు చేసింది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 83. 36 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తెలుగులో రూ. 4.36 కోట్ల లాభాల్లోకి వచ్చింది. కెజియఫ్ వారాల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 576.68 కోట్ల షేర్ (రూ. 1175.40 కోట్ల గ్రాస్)ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్లో బిజినెస్ చేయగా.. రూ. 229.68 కోట్ల లాభాలను రాబట్టింది. కానీ ఏపీలో మాత్రం ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి కాకపోవడం విశేషం.
మొత్తంగా హిందీలో మాత్రం అంచనాలకు మించి వసూళ్లను రావడమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 రూ. 345 కోట్ల రేంజ్లో బిజినెస్ చేయగా.. రూ. 229.68 కోట్ల లాభాలను రాబట్టింది. కానీ ఏపీలో మాత్రం ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూగర్తి కాకపోవడం విశేషం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.