Home /News /movies /

KGF CHAPTER 2 COMPLETES 3 WEEKS AND THIS MOVIE BREAKS MANY RECORDS IN TOLLYWOOD BOLLYWOOD BUT NOT BREAK EVEN IN KARNATAKA TA

KGF 2 : బాలీవుడ్‌లో కేజీఎఫ్ 2 రచ్చ.. సొంత ఇలాకా కర్ణాటకలో బ్రేక్‌ ఈవెన్‌కు దూరంలో కేజీఎఫ్ 2..

KGF 2 3 వీక్స్ కలెక్షన్స్   (KGF Chapter 2 Photo : Twitter)

KGF 2 3 వీక్స్ కలెక్షన్స్ (KGF Chapter 2 Photo : Twitter)

KGF 2 - 3 Weeks Box Office Collections : ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ కేజీఎఫ్ స్టార్ యశ్ మాత్రం సొంత ఇలాకా శాండిల్‌వుడ్‌లో కాకుండా.. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే బయట ఏరియాలో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నారు.

    KGF 2 - 3 Weeks Box Office Collections : ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ కేజీఎఫ్ స్టార్ యశ్ మాత్రం బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే బయట ఏరియాలో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నారు. కానీ సొంత ఇలాకాలో మాత్రం కేజీఎఫ్ 2 మాత్రం కాస్త వెనబడిందనే చెప్పాలి. కేజీఎఫ్ 2 ఈ రేంజ్ సక్సెస్ వెనక నార్త్ ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2022లో బీటౌన్‌లో ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు తాజాగా కేజీఎఫ్ 2 ఆమీర్ ఖాన్ ‘దంగల్’ లైఫ్ టైమ్ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను దాటి సంచలనం రేపింది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అది కూడా తెలంగాణలో మాత్రం అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడితే.. ఏపీలో ఒక్కంటే ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాకపోవడం విచిత్రమనే చెప్పాలె.

    ఓవరాల్‌గా ‘కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ హిట్ ఈ సినిమాకు ఎక్కడో తీసుకెళ్లి పెట్టిందనే చెప్పాలి.   బాలీవుడ్‌లో కేజీఎఫ్ 2 రచ్చ.. సొంత ఇలాకాలో కర్ణాటకలో బ్రేక్‌ ఈవెన్‌కు దూరంలో ఉంది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో  రికార్డు స్థాయి రూ.  78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 80.90 కోట్ల (రూ. 130.65 కోట్ల గ్రాస్ ) రాబట్టింది.  కెజియఫ్ 3 వారాల్లో  వరల్డ్ వైడ్‌గా రూ. 541.80 కోట్ల షేర్ (రూ. 1097.10 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమా  బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చింది. ఈ సినిమా రూ. 9.85 కోట్ల షేర్ ( రూ. 20.10 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.

    Chiranjeevi - Ram Charan | NTR - NBK : ఎన్టీఆర్, బాలకృష్ణ టూ చిరంజీవి, రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన తండ్రీ కొడుకుల కాంబినేషన్ మూవీస్..

    నైజాం (తెలంగాణ):  రూ. 41.65కోట్లు / రూ. 25కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ.  11.40 కోట్లు  /రూ. 14 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.  7.50 కోట్లు / రూ. 10  కోట్లు
    ఈస్ట్: రూ. 5.48 కోట్లు / రూ. 7 కోట్లు
    వెస్ట్: రూ. 3.47 కోట్లు రూ. 6 కోట్లు
    గుంటూరు: రూ. 4.60 కోట్లు / రూ. 7 కోట్లు
    కృష్ణా: రూ. 4.08 కోట్లు / రూ. 6కోట్లు
    నెల్లూరు:రూ. 2.72 కోట్లు / రూ. 3 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.90 కోట్లు షేర్ (రూ. 130.65 కోట్లు గ్రాస్) రాబట్టింది.

    • ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..


    కర్ణాటక : రూ. 97.75 కోట్లు (రూ. 170.05 కోట్లు గ్రాస్ ) / రూ. 100 కోట్లు
    తెలుగు : రూ. 80.90 కోట్లు (130.65 కోట్లు గ్రాస్ ) / రూ. 78 కోట్లు
    తమిళ్ : రూ. 47.80 కోట్లు (రూ. 98.65 కోట్లు గ్రాస్) / రూ. 27 కోట్లు
    కేరళ : రూ. 28.55 కోట్లు (60.80 కోట్లు గ్రాస్ ) / రూ. 10 కోట్లు
    హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 199.40 కోట్లు (రూ. 466.05 కోట్లు గ్రాస్) / రూ. 100 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 87.40 కోట్లు (రూ. 170.90 కోట్లు) / రూ. 30 కోట్లు
    టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 541.80 కోట్లు (రూ. 1097.10 కోట్ల గ్రాస్) వసూళు చేసింది.

    Acharya 6 Days WW Collections : చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్య 6 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..


    మొత్తంగా హిందీలో మాత్రం అంచనాలకు మించి వసూళ్లను రావడమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఓవరాల్‌గా  ఈ సినిమా రూ. 194.80 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. . మొత్తంగా 21 రోజుల్లో ఈ సినిమా కనీవినీ ఎరగని వసూళ్లను రాబట్టింది. త్వరలో  రూ. 1100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, KGF Chapter 2, Sandalwood, Tollywood, Yash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు