ఎన్నో రోజులుగా కెజియఫ్ 2 సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు అభిమానులు. ఒకటి రెండు కాదు.. ఐదు భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 23న ఒకేరోజు విడుదల కాబోతుంది. నిజంగా వాళ్లు సినిమా ఈ స్థాయి విజయం సాధిస్తుందని అనుకోలేదేమో..? ఎందుకంటే తొలిభాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం లేదు. ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ ఇప్పుడే పూర్తి చేయకూడదని వాళ్లు ఫిక్స్ అయిపోయారు.

కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (KGF Chapter 2 release date)
నెమ్మదిగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ అసలు బిజినెస్ మొదలుపెట్టాలి అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పటి వరకు ట్రైలర్స్, టీజర్స్ విడుదలవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అని వాళ్ళ అంచనా. అందుకే ఇప్పుడే సినిమా అమ్మకూడదని వాళ్లు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. పైగా చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది.

కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)
ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు. సినిమా పూర్తయిన తర్వాత కానీ అమ్మకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యశ్ హీరోగా నటించాడు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. అక్టోబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రశాంత్.

కేజీఎఫ్ షూటింగ్లో పాల్గొన్న రవీనా టాండన్ (Twitter/Photo)
విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఇదివరకే చిత్రీకరించాడు దర్శకుడు. ఇదిలా ఉంటే క్లైమాక్స్‌లో మెయిన్ విలన్ అధీరాను రాఖీ చంపేసిన తర్వాత బాధ్షా అయిపోతాడు. అయితే దేశ ప్రధాని పాత్రలో నటిస్తున్న రవీనా టాండన్ తన సైన్యంతో రాఖీ భాయ్‌ను కూడా చంపించేస్తుందని తెలుస్తుంది. అలా క్లైమాక్స్ విషాదాంతమే అవుతుందని.. అమ్మ మాట ప్రకారం చచ్చిపోయేటప్పుడు ధనవంతుడిగానే రాఖీ చచ్చిపోతాడని.. అలా కెజియఫ్ కథ అంతమైపోతుందని ప్రచారం జరుగుతుంది. విషాదాంతం అయినా కూడా ఎమోషనల్‌గా కథను ముగించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
Published by:Praveen Kumar Vadla
First published:May 27, 2020, 21:06 IST