కేజీఎఫ్ పార్ట్ 2 కోసం ఎంత బడ్జెట్ పెడుతున్నారో తెలిస్తే షాకే...
రెండో భాగం చిత్రీకరణ కోసం ఇప్పటికే 80 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ మొదటి భాగం అందుకున్న భారీ విజయం దృష్ట్యా బడ్జెట్ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మరింత బడ్జెట్ కేటాయించేందుకు సైతం హొంబలే ఫిల్మ్స్ సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
news18-telugu
Updated: May 14, 2019, 12:42 PM IST

కేజియఫ్లో యశ్
- News18 Telugu
- Last Updated: May 14, 2019, 12:42 PM IST
కన్నడ సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కేజీఎఫ్ సినిమా సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ మొదటి భాగాన్ని 80 కోట్లతో తెరకెక్కించగా, కన్నడ, హింది, తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. అంతే కాదు ఏకంగా 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ 2 చిత్రీకరణ ఇప్పటికే 90 శాతం పూర్తయ్యిందని చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించారు. మైసూరు, బెంగుళూరు, హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటోంది. రెండో భాగంలో ఫైట్స్ అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నట్లు చిత్ర నిర్మాణ యూనిట్ తెలిపింది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండో పార్ట్ లో ప్రముఖ బాలివుడ్ తారలు సైతం నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో ప్రతినాయక పాత్రలో సంజయ్ దత్ నటించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.
ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి సినిమా విడుదలకు సిద్ధమవుతుందని చిత్ర నిర్మాణ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే రెండో భాగం చిత్రీకరణ కోసం ఇప్పటికే 80 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ మొదటి భాగం అందుకున్న భారీ విజయం దృష్ట్యా బడ్జెట్ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మరింత బడ్జెట్ కేటాయించేందుకు సైతం హొంబలే ఫిల్మ్స్ సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాకు ఇప్పటికే అంతర్జాతీయంగా క్రేజ్ వచ్చిన నేపథ్యంలో మరింత పకడ్బందీగా, అత్యున్నత సాంకేతిక విలువలతో రెండో బాగాన్ని విడుదల చేస్తే ప్రొడ్యూసర్లకు కాసుల పంటేనని అంచనా ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

స్టార్ హీరోకు నటుడి భార్య రిక్వెస్ట్.. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ..
కొన్ని బంధాలను మధ్యలో వదిలేయడమే మంచిది .. రష్మిక మందన్న
వైరల్ సాంగ్... కన్నడ పాటను పాడిన శ్రీలంక సింగర్... నెటిజన్లు ఫిదా
అనుష్క పాత్రలో మాజీ ముఖ్యమంత్రి భార్య.. విడుదలైన ఫస్ట్ లుక్..
భర్త అంబరీష్ను తలుచుకొని భావొద్వేగానికి లోనైన సుమలత..
Upendra: ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రకు అరుదైన గౌరవం..
Loading...