Home /News /movies /

KGF CHAPTER 2 ANOTHER RARE RECORD IN 32 DAY IN BOX OFFICE AND ENTERED INTO 1200 CRORE CLUB TA

KGF 2 : విడుదలైన 32వ రోజున కేజీఎఫ్ 2 ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఆర్ఆర్ఆర్ కూడా సాధ్యం కాలేదుగా..

KGF Chapter 2 ఖాతాలో మరో రికార్డు (Twitter/Photo)

KGF Chapter 2 ఖాతాలో మరో రికార్డు (Twitter/Photo)

KGF Chapter 2   : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా  స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమా ఖాతాలో ఆర్ఆర్ఆర్‌కు కూడా సాధ్యం కానీ మరో రికార్డు నమోదు చేసింది.

    KGF Chapter 2   : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా  స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్, నార్త్  అనే తేడా లేకుండా మొత్తం భారతీయ  బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఆరో వారంలో కూడా ఇరగదీస్తోంది. ఫస్ట్ వీక్‌లోనే అక్కడ బాహుబలి 2 మరియు ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ గ్రాస్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది.  ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా నిన్నటితో రూ. 1200 కోట్ల గ్రాస్ క్లబ్బులోచేరి ఈ  యేడాది చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బాహుబలి 2  తర్వాత స్థానంలో నిలిచింది.

    ఇక ఈ మూవీ  హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.మొదటి నాలుగు రోజులు హాలీ డేస్‌ను కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకుంది.   ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో  రికార్డు స్థాయి రూ.  78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 83.74 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తెలుగులో రూ. 4.74 కోట్ల లాభాల్లోకి వచ్చింది.  కెజియఫ్ వారాల్లో  వరల్డ్ వైడ్‌గా 32వ రోజు రూ. 587.54 కోట్ల షేర్ (రూ. 1200.15 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. రూ. 240.54 కోట్ల లాభాలను రాబట్టింది. కానీ ఏపీలో మాత్రం ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి కాకపోవడం విశేషం.

    Acharya : ఆచార్య సహా భారీ అంచనాలతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..


    నైజాం (తెలంగాణ):  రూ. 42.71 కోట్లు / రూ. 25కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ.  11.94 కోట్లు  /రూ. 14 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.  7.90 కోట్లు / రూ. 10  కోట్లు
    ఈస్ట్: రూ. 5.58 కోట్లు / రూ. 7 కోట్లు
    వెస్ట్: రూ. 3.64 కోట్లు రూ. 6 కోట్లు
    గుంటూరు: రూ. 4.89 కోట్లు / రూ. 7 కోట్లు
    కృష్ణా: రూ. 4.26 కోట్లు / రూ. 6కోట్లు
    నెల్లూరు:రూ. 2.82 కోట్లు / రూ. 3 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో రూ. 83.74 కోట్లు షేర్ (రూ. 135.900 కోట్లు గ్రాస్) రాబట్టింది.

    • ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..


    కర్ణాటక : రూ. 103.63 కోట్లు (రూ. 181.05 కోట్లు గ్రాస్ ) / రూ. 100 కోట్లు
    తెలుగు : రూ. 83.74 కోట్లు (135.90 కోట్లు గ్రాస్ ) / రూ. 78 కోట్లు
    తమిళ్ : రూ.52.70 కోట్లు (రూ. 110.80 కోట్లు గ్రాస్) / రూ. 27 కోట్లు
    కేరళ : రూ. 30.82 కోట్లు (65.15 కోట్లు గ్రాస్ ) / రూ. 10 కోట్లు
    హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 214.40 కోట్లు (రూ. 511.85 కోట్లు గ్రాస్) / రూ. 100 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 97.25 కోట్లు (రూ. 195.40 కోట్లు) / రూ. 30 కోట్లు
    టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 587.54 కోట్లు (రూ. 1200.15 కోట్ల గ్రాస్) వసూళు చేసింది.

    Sarkaru Vaari Paata 4 Days WW Collections : ’సర్కారు వారి పాట’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. వీకెండ్‌ను క్యాష్ చేసుకున్న మహేష్ బాబు..

    మొత్తంగా హిందీలో మాత్రం అంచనాలకు మించి వసూళ్లను రావడమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. రూ. 240.54 కోట్ల లాభాలను రాబట్టింది. ఈ యేడాది ఆర్ఆర్ఆర్ సాధ్యంకానీ రూ. 1200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడం మామలు విషయం కాదంటున్నారు ట్రేడ్ పండితులు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: KGF Chapter 2, Prashanth Neel, Tollywood, Yash

    తదుపరి వార్తలు