Home /News /movies /

KGF CHAPTER 2 2 WEEKS WORLD WIDE BOX OFFICE COLLECTIONS YASH PRASHANTH MAGIC CONTINUES TA

KGF 2 - 2 Weeks WW Collections : కేజీఎఫ్ 2 14 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. 2 వారాలైన తగ్గని యశ్ దూకుడు..

కేజిఎఫ్ ఛాప్టర్ 2 14 రోజుల కలెక్షన్స్ (KGF Chapter 2 Photo : Twitter)

కేజిఎఫ్ ఛాప్టర్ 2 14 రోజుల కలెక్షన్స్ (KGF Chapter 2 Photo : Twitter)

KGF Chapter 2  - 2 Weeks Box Office Collections  : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్నటితో 2 వారాల రన్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 14 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇంకా చదవండి ...
    KGF Chapter 2  - 14 Days Collections  : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా మొత్తంగా ఇండియన్  బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.  అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఇరగదీస్తోంది. ఫస్ట్ వీక్‌లోనే అక్కడ బాహుబలి 2 మరియు ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టి దూసుకుపోతోంది.  భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తోంది.   అంతేకాదు హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు హిందీలో 2 వారాల్లో రూ. 343.13  కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ‘దంగల్’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌కు చేరువలో ఉంది.

    మొదటి నాలుగు రోజులు హాలీ డేస్‌ను కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇక పన్నెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఈ సినిమా 14వ రోజు  తెలుగు రాష్ట్రాలలో రూ. 0.76 కోట్ల షేర్ (రూ. 1.25 కోట్లు గ్రాస్ )  సాధించింది. ఓవరాల్‌గా 14వ రోజు ఈ సినిమా రూ. 6.91 కోట్ల షేర్ (రూ. 14.90 కోట్ల గ్రాస్) వసూళు చేసింది.  ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో  రికార్డు స్థాయి రూ.  78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇంకా తెలుగులో ఇంకా రూ. 2.79 కోట్ల షేర్ రాబట్టాలి. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా ఏపీలో పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. కెజియఫ్ వారాల్లో  వరల్డ్ వైడ్‌గా రూ. 473.16కోట్ల షేర్ (రూ. 957.65 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమా  బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

    Mahesh Babu - Pokiri@16Years: మహేష్ బాబు ‘పోకిరి’కి 16 ఏళ్లు.. ఫైనల్‌గా ఎంత కలెక్ట్ చేసిందంటే..


    నైజాం (తెలంగాణ):  రూ. 39.47కోట్లు / రూ. 25కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ.  10.64 కోట్లు  /రూ. 14 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.  6.97 కోట్లు / రూ. 10  కోట్లు
    ఈస్ట్: రూ. 5.20 కోట్లు / రూ. 7 కోట్లు
    వెస్ట్: రూ. 3.25 కోట్లు రూ. 6 కోట్లు
    గుంటూరు: రూ. 4.26 కోట్లు / రూ. 7 కోట్లు
    కృష్ణా: రూ. 3.85 కోట్లు / రూ. 6కోట్లు
    నెల్లూరు:రూ. 2.57 కోట్లు / రూ. 3 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో రూ. 76.21 కోట్లు షేర్ (రూ. 122.55 కోట్లు గ్రాస్) రాబట్టింది.

    • ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..


    కర్ణాటక : రూ. 84.35 కోట్లు (రూ. 145.70 కోట్లు గ్రాస్ ) / రూ. 100 కోట్లు
    తెలుగు : రూ. 76.21 కోట్లు (122.55 కోట్లు గ్రాస్ ) / రూ. 78 కోట్లు
    తమిళ్ : రూ.36.90 కోట్లు (రూ. 74.60 కోట్లు గ్రాస్) / రూ. 27 కోట్లు
    కేరళ : రూ. 24.25 కోట్లు (52.65 కోట్లు గ్రాస్ ) / రూ. 10 కోట్లు
    హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 172.05 కోట్లు (రూ. 403.80 కోట్లు గ్రాస్) / రూ. 100 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 78.30 కోట్లు (రూ. 158.35 కోట్లు) / రూ. 30 కోట్లు
    టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 473.16 కోట్లు (రూ. 957.65 కోట్ల గ్రాస్) వసూళు చేసింది. ఓవరాల్‌గా 14వ రోజు బాక్సాఫీస్ దగ్గర 6.91 కోట్ల షేర్ ( 14.90 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది.

    Bahubali2@5Years: బాహుబలి 2@5 ఇయర్స్.. ప్రభాస్‌తో రాజమౌళి మాయాజాలం సాధించిన రికార్డులు..


    ఈ సినిమా తెలుగులో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 79 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా 2వారాల్లో  రూ. 76.21 కోట్లు (రూ. 122.55 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది. మొత్తంగా రూ. 473.16 కోట్ల షేర్ (రూ. 957.65 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. 14 రోజుల్లో రూ. 473.16 కోట్ల షేర్ (957.65 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి మరో రికార్డు క్రియేట్ చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఏపీలో ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అటు ,కర్ణాటకలో బ్రేక్ ఈవెన్‌కు రూ. 15.75 కోట్ల దూరంలో ఉంది. మొత్తంగా హిందీలో మాత్రం అంచనాలకు మించి వసూళ్లను రావడమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఓవరాల్‌గా  ఈ సినిమా రూ. 126.16 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. . మొత్తంగా రెండు వారాల్లో ఈ సినిమా కనీవినీ ఎరగని వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ ఈ చిత్రం  బాక్సాఫీస్ దగ్గర  ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Prashanth Neel, Tollywood, Tollywood Box Office Report, Yash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు