దమ్మున్న కథతో వచ్చి దుమ్ములేపిన కేజీఎఫ్ మరో రికార్డ్..

కథలో దమ్ము ఉంటే.. ఊరు పేరు తెలియని హీరో చేసిన ఆ సినిమా హిట్ అవుతుంది అని నిరూపించింది కన్నడ మూవీ 'కేజీఎఫ్'.

news18-telugu
Updated: December 7, 2019, 11:22 AM IST
దమ్మున్న కథతో వచ్చి దుమ్ములేపిన కేజీఎఫ్ మరో రికార్డ్..
Twitter
  • Share this:
కథలో దమ్ము ఉంటే.. ఊరు పేరు తెలియని హీరో చేసిన ఆ సినిమా హిట్ అవుతుంది అని నిరూపించింది కన్నడ మూవీ 'కేజీఎఫ్'. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో యష్ పర్‌ఫార్‌మెన్స్ చూసి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 2018లో ఈ సినిమా చాప్టర్ 1 విడుదలైంది. విడుదలైన అన్ని భాషాల్లో అదిరిపోయే కలెక్షన్స్‌తో అదరగొట్టింది కేజీఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనంగా మారింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది 'కేజీఎఫ్'. అది అలా ఉంటే.. ఈ మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. కేజిఎఫ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అక్కడ అత్యధికంగా వ్యూస్ సాధించి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ సినిమా 2019 సంవత్సరానికి గాను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అయిన అన్ని చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా నిలిచి మరో రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్ 'అధీరా'గా నటిస్తున్నాడు.

Twitter


సిమ్లా యాపిల్‌గా మెరిసిపోతున్న పూజిత పొన్నాడ
First published: December 7, 2019, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading