Home /News /movies /

KGF ACTOR MOHAN JUNEJA PASSES AWAY DUE TO SUFFERING WITH PROLONGED ILLNESS SB

KGF 2: సినీ ఇండస్ట్రీకి షాక్...కేజీఎఫ్ స్టార్ యాక్టర్ మృతి !

కేజీఎఫ్ చాఫ్ట్ 2లో నటుడు మృతి

కేజీఎఫ్ చాఫ్ట్ 2లో నటుడు మృతి

సంబరాల్లో మునిగి తేలిన కేజీఎఫ్ టీంకు భారీ షాక్ తగిలింది. కేజీఎఫ్2లో నటించిన ప్రముఖ నటుడు ఇవాళ తెల్లవారుజామున మృతి చెందడంతో అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

    కేజీఎఫ్ చాప్టర్ 2 ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ను ఆ మూవీ టీం అంతా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ... వారికి షాక్ తగిలింది. కేజీఎఫ్‌2లో నటించిన ప్రముఖ నటుడు మృతి చెందారు.  ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు అయిన మోహ‌న్ జునేజా ఇవాళ కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్  హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. ఇవాళ  తెల్ల‌వారుజామున‌ తుది శ్వాస విడిచాడు.

    మోహన్ జునేజ


    సిరీయ‌ల్ యాక్ట‌ర్‌గా తన  కెరీర్ ప్రారంభించిన‌ మోహ‌న్ చాలా తక్కువ కాలంలోనే  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో మంచి నటుడిగా  మోహన్ కు ఇమేజ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మోహన్ జునేజా దాదాపుగా 100కు పైగా సినిమాల‌లో న‌టించాడు. చివ‌ర‌గా ఈయ‌న పాన్ ఇండియా మూవీ  కేజీఎఫ్ చాప్ట‌ర్‌-2 లో న‌టించి మెప్పించాడు. మోహన్ జునేజామ‌ర‌ణం ప‌ట్ల క‌న్న‌డ  ఫిల్మ్ ఇండస్ట్రీ  షాక్ లోకి వెళ్ళిపోయింది. అంతే కాదు కెజియఫ్ టీమ్ తో పాటు కన్నడ  ప‌రిశ్ర‌మ  నుంచి స్టార్స్ అంతా ఆయన మృతికి  సంతాపం ప్రకటిస్తున్నారు.

    కెరీర్‌లో కేజీఎఫ్ సినిమా పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. ఇక మోహన్ తమిళ్,తెలుగు,  హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. చెల్లా సినిమాలో ఆయన  చేసిన రోల్...  సినీ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చెల్లాట సినిమాలో  మోహ‌న్ కమెడీయ‌న్ పాత్ర‌లో న‌టించాడు. ఇక ఆతరువాత వరుసగా మ‌స్తీ, రామ్‌లీలా,బ‌చ్చ‌న్‌, కేజీఎఫ్ లాంటి  సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని మరణం కేజీఎఫ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా మోహన్ జునేజికి ఘన నివాళులర్పిస్తున్నారు. KGF నటుడు మోహన్ జునేజా తుమకూర్‌కు చెందినవారు, చదువుకుని బెంగళూరులో స్థిరపడ్డారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: KGF, KGF Chapter 2, Prashanth Neel, Yash

    తదుపరి వార్తలు