• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KGF 2 YASH KGF CHAPTER 2 RELEASE DATE FIXED HERE ARE THE DETAILS TA

KGF 2 - Yash: కేజీఎఫ్ 2 విడుదల తేది ఖరారైందా.. యశ్ బాక్సాఫీస్ దండయాత్రకు కుదిరిన ముహూర్తం..

యశ్ ‘కేజీఎఫ్ 2’ మూవీ పోస్టర్ (Twitter/Photo)

KGF 2 - Yash: కేజీఎఫ్ 2 విడుదల తేది ఖరారైందా.. యశ్ బాక్సాఫీస్ దండయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి శాండిల్ వుడ్ వర్గాలు. 

  • Share this:
    KGF 2 - Yash: కేజీఎఫ్ 2 విడుదల తేది ఖరారైందా.. యశ్ బాక్సాఫీస్ దండయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి శాండిల్ వుడ్ వర్గాలు.  కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్) అనే ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు యశ్. బాహుబలితో ప్రభాస్‌కు ఏ విధంగా నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చిందో.. ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ అదే రేంజ్‌లో పాపులార్ అయ్యారు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమా కన్నడలో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్  చేసింది. అంతేకాదు హిందీలో దాదాపు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే రూ. 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. . మొత్తంగా కేజీఎఫ్ మూవీతో యశ్ యశస్సు పీక్స్‌కు వెళ్లిందనే చెప్పాలి. ప్రభాస్ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ సినిమా విషయానికస్తే..  70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు.

    KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్‌తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే  విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

    KGF star Yash, KGF star Yash donates, KGF star Yash films, KGF star Yash latest news, KGF star Yash family, యష్
    Yash Photo : Instagram


    ఆ సంగతి పక్కన పెడితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 కోసం పారితోషకంగా రూ. 11 కోట్ల వరకు తీసుకున్నాడు. ఒక రకంగా కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఒక సినిమా కోసం రెండేళ్లకు పైగా బల్క్ డేట్స్ కేటాయించడంతో అంత పారితోషం తీసుకున్నారు. తాజాగా కేజీఎప్ 2 ఛాప్టర్ 2 కోసం రాకింగ్ స్టార్ తన రెమ్యునరేషన్‌ను దాదాపు రూ. 30 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు శాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 200 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. ఆ సంగతి పక్కన పెడితే..  ఈసినిమాను ముందుగా జూలై 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా కూడా విడుదల వాయిదా పడింది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యశ్ డబ్బింగ్ కూడా మొదలు పెట్టాడు. మరోవైపు హిందీలో కూడా యశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో ఎవరు పోటీలేని టైమ్‌లో కేజీఎఫ్ విడుదలైన డేట్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: