KGF 2 VS RRR KGF CHAPTER 2 TRAILER CREATS NEW SENSATION AT BOX OFFICE ITS BREAKS RRR ONE OF THE RECORD HERE ARE THE DETAILS TA
KGF 2 Vs RRR : విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ పేరిట ఆ రికార్డును బ్రేక్ చేసిన కేజీఎఫ్ 2..
విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ ఆ రికార్డు బ్రేక్ చేసిన KGF 2 (File/Photos)
KGF 2 Vs RRR : | అవును రిలీజ్‌కు ముందే ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా పేరిట ఉన్న ఓ రికార్డును యశ్, ప్రశాంత్నీల్ల ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter 2) మూవీ క్రాస్ చేసింది. వివరాల్లోకి వెళితే..
KGF 2 Vs RRR : | అవును రిలీజ్‌కు ముందే ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా పేరిట ఉన్న ఓ రికార్డును యశ్, ప్రశాంత్నీల్ల ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter 2) మూవీ క్రాస్ చేసింది. వివరాల్లోకి వెళితే.. కేజీఎఫ్ అనే ఒక్క సినిమా ఒక్క సినిమాతో హీరోగా యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల కింది వరకు ఈయన కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఇతని రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియన్ రేంజ్లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ వచ్చింది. త్వరలోనే ఈయన కేజీఎఫ్ 2 మూవీతో పలకరించనున్నారు. కెజియఫ్ 2కు ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే రైట్స్ కోసం చెల్లించారంటే రేంజ్ అర్థం చేసుకోవచ్చు. యశ్ ఇప్పుడు కన్నడలో నెంబర్ వన్ హీరో. అక్కడ తొలి రూ. 200 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసిన హీరో.
తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన తుపాన్ పాటతో పాటు ఈ సినిమా ట్రైలర్ సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంట్లో భారతీయ సినిమాల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్‌గా రికార్డు బద్దలు కొట్టిందట. కేజీఎఫ్ ఛాప్టర్ విడుదలైన ఒక రోజు వ్యవధిలో24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్ రాబట్టింది. కేజీఎఫ్ 2 రూపొందించిన కన్నడలో 18 మిలియన్ వ్యూస్ వస్తే.. తెలుగులో అంతే కంటే ఎక్కువగా 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక హిందీలో 51 మిలియన్ వ్యూస్ రాబట్టింది. తమిళ ట్రైలర్‌కు 24 గంటల్లో 12 మిలియన్ పైగా వ్యూస్ వస్తే.. మలయాళం ట్రైలర్‌కు 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తాజాగా ఇప్పటి వరకు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 140 మిలియన్ వ్యూస్‌కు దగ్గరగా ఉంది.
అంతకు ముందు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 51.12 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక ’రాధే శ్యామ్’ మూవీ 57.5 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా కేజీఎఫ్ 2 ఆ రికార్డులను అన్నింటినీ బ్రేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 నిలిచింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ హక్కులు అన్ని భాషల్లో భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. 168.06 నిమిషాలు అంటే.. 2 గంటల 48 నిమిషాల 6 సెకన్లు ఉంది. బాహుబలి తర్వాత ఓ సినిమా రెండో భాగం కోసం ప్రేక్షకులు అంతగా వేచి చూస్తున్నది ఈ సినిమా కోసమే. ఛాప్టర్ 1 ఇంత విజయం సాధిస్తుందని నిజంగా వాళ్లు కూడా ఊహించలేదేమో..? కెజియఫ్ 1 ఏకంగా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ 250 కోట్లకు పైగానే జరుగుతుంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగిపోయాయి. బిజినెస్ రేంజ్ కూడా భారీగానే జరుగుతుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.