KGF 2 Vs Laal Singh Chaddha : కేజీఎఫ్ 2 వర్సెస్ లాల్ సింగ్ చద్ధా.. రసవత్తరంగా బాక్సాఫీస్ వార్.. వివరాల్లోకి వెళితే.. కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్) అనే ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు యశ్. బాహుబలితో ప్రభాస్‌కు ఏ విధంగా నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చిందో.. ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ అదే రేంజ్లో పాపులార్ అయ్యారు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమా కన్నడలో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు హిందీలో దాదాపు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. తెలుగులో కెజియఫ్ (KGF) తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే రూ. 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది.
తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. మొత్తంగా కేజీఎఫ్ మూవీతో యశ్ (Yash) యశస్సు పీక్స్‌కు వెళ్లిందనే చెప్పాలి. ప్రభాస్ (Prabhas) తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేజీఎఫ్ సినిమా విషయానికస్తే.. 70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు.KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
KGF 2 Vs లాల్ సింగ్ చద్ధా (Twitter/Photo)
అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 14 ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.
మరోవైపు ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాను ముందుగా ఫిబ్రవరి 11న ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజగా ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి రసవత్తర పోరు నెలకొన్నట్టు అయింది. ఇక హీరోగా ఆమీర్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కేజీఎఫ్‌లో హిందీ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలకమైన విలన్ పాత్రలో నటిస్తే.. ఆమీర్ ఖాన్.. ‘లాల్ సింగ్ చద్ధా’లో నాగ చైతన్య మరో హీరోగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆమీర్ ఖాన్ నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ విషయానికొస్తే.. ఈ సినిమాను హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. మొత్తంగా కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ రోజునే ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’ విడుదల చేస్తుండంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రసవత్తర పోరుకు తెరలేచిందనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.