KGF 2 Teaser: కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది. అంతేకాదు కన్నడ సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమాను 70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇకKGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు తీసుకున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. సంజూ బాబా ఎంట్రీతో ఈ సినిమాపై నార్త్ లో కూడా అంచనాలు పెరిగాయి. కేజీఎఫ్ 2 సినిమా చేస్తూనే ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా టీజర్‌ను వచ్చే యేడాది జనవరి 8న యశ్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు.
కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ రీసెంట్గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీజర్ విడుదల తర్వాత కేజీఎఫ్ 2పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది.

కేజీఎఫ్ 2లో యశ్ (Twitter/Photo)
ఇక హిందీలో రూ. 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు. సినిమా పూర్తయిన తర్వాత కానీ అమ్మకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యశ్ హీరోగా నటించాడు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది.

కేజీఎఫ్ 2లో యశ్ (Twitter/Photo)
విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఇదివరకే పిక్చరైజ్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే క్లైమాక్స్‌లో మెయిన్ విలన్ అధీరాను రాఖీ చంపేసిన తర్వాత బాధ్షా అయిపోతాడు. అయితే దేశ ప్రధాని పాత్రలో నటిస్తున్న రవీనా టాండన్ తన సైన్యంతో రాఖీ భాయ్‌ను కూడా చంపించేస్తుందని టాక్ వినబడుతోంది. చూడాలిక ఈ సినిమాలో రాఖీ భాయ్.. పాత్రను విషాదాంతం చేస్తారా.. ? లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 03, 2020, 15:38 IST