KGF 2 ప్రారంభం.. ఈ సారి యశ్ ఎలాంటి మాయ చేస్తాడో..

KGF 2 | కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపింది. అంతేకాదు కన్నడలో తొలి రూ.100 కోట్లతో పాటు రూ.200 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా కేజీఎఫ్ చరిత్ర సృష్టించింది. తాజాగా KGF  chapter 2 సినిమా బెంగళూరుగా లాంఛనంగా ప్రారంభమైంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 14, 2019, 10:27 AM IST
KGF 2 ప్రారంభం.. ఈ సారి యశ్ ఎలాంటి మాయ చేస్తాడో..
KGFలో యశ్
  • Share this:
కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతునే ఉంది. అంతేకాదు కన్నడలో తొలి రూ.100 కోట్లతో పాటు రూ.200 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా కేజీఎఫ్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈసినిమాతో యశ్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇక KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా KGF  chapter 2 సినిమా బెంగళూరుగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ  ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరో యశ్‌తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరందార్ హాజరయ్యారు. ఈ విషయాన్ని హీరో యశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు.



KGF chapter 1 ఇచ్చిన సక్సెస్‌తో KGF chapter 2ను ఇంకా బిగ్గర్‌గా, బెటర్‌గా మొదటి పార్ట్‌ను మించేలా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యపాత్రలో నటిస్తున్నడని ఈ చిత్ర  యూనిట్ కన్ఫామ్ చేసింది. మరోవైపు రవీనా టాండన్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి కేజీఎఫ్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన యశ్ ..కేజీఎఫ్ 2 తో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.



First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>