RRR Movie: ఆర్ ఆర్ ఆర్‌కు పోటీగా కెజియఫ్2 రిలీజ్.. ?

RRR Movie : బాహుబలి, కెజియఫ్ చిత్రాలు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సంపాదించాయో తెలిసిందే.

news18-telugu
Updated: March 7, 2020, 2:03 PM IST
RRR Movie: ఆర్ ఆర్ ఆర్‌కు పోటీగా కెజియఫ్2 రిలీజ్.. ?
ఆర్ ఆర్ ఆర్, కెజియఫ్2 పోస్టర్స్ Photo : Twitter
  • Share this:
RRR Movie : బాహుబలి, కెజియఫ్ చిత్రాలు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సంపాదించాయో తెలిసిందే. అయితే వాటికి కొనసాగింపుగా ఇప్పుడు అంతకు మించి రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మికంగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ కాగా.. మరోకటి కెజియఫ్ కు కొనసాగింపుగా వస్తోన్న కెజియఫ్ 2. దేశ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలకు యమ క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ పీరియాడిక్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది 8న విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. మరోవైపు ఎలాంటీ స్పష్టమైన తేదీ ప్రకటించకున్నప్పటికీ దాదాపు అదే తేదీల్లో కెజియఫ్ 2 విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీంతో కెజియఫ్ 2 మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ తో పోటీకి దిగడానికి సిద్ధమయ్యారని, వారు కూడా జనవరిలో సంక్రాంతి సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు కెజియఫ్ స్టార్ యష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ కెజియఫ్2 మధ్య క్లాష్ అనేది జరగని పని అన్నారు. ఇక ఈ రెండు చిత్రాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది అనిల్ తడానీ , కాబట్టి రెండు ఒకే సమయంలో విడుదల అవడం జరగదన్నారు.

 KGF 2 release date,kgf 2,kgf chapter 2,kgf 2 release date,rrr,kgf 2 trailer,kgf 2 vs rrr,kgf chapter 2 release date,kgf 2 teaser,kgf chapter 2 trailer,kgf vs rrr,kgf 2 latest news,yash kgf 2,kgf 2 movie,rrr official teaser,kgf 2 public expectations,kagf 2 release date,rrr release date,#rrr and kgf 2 movies release update,rrr teaser,rrr trailer,kgf 2 full movie,rrr vs kgf,kgf chapter 2 vs rrr,ఆర్ ఆర్ ఆర్‌,కెజియఫ్,కెజియఫ్2,
ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter


కాగ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్‌లో ఇటూ సౌత్ స్టార్స్‌తో పాటు ఇటూ హిందీ నటులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా అజయ్ దేవగన్, సముద్ర ఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు రామ్ చరణ్ సరసన హిందీ నటి ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తోంది. ఇలా హిందీ నటులను కలుపుకొని సినిమాలను పాన్ ఇండియన్ లెవల్‌లో మార్కెట్ పెంచుకుంటున్నారు. ఇదే పద్దతిలో కెజియఫ్ 2 కూడా కొనసాగుతోంది. మొదటి పార్ట్‌లో హిందీ నటులు లేకున్నా.. కెజియఫ్2లో మాత్రం ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు.

 KGF 2 release date,kgf 2,kgf chapter 2,kgf 2 release date,rrr,kgf 2 trailer,kgf 2 vs rrr,kgf chapter 2 release date,kgf 2 teaser,kgf chapter 2 trailer,kgf vs rrr,kgf 2 latest news,yash kgf 2,kgf 2 movie,rrr official teaser,kgf 2 public expectations,kagf 2 release date,rrr release date,#rrr and kgf 2 movies release update,rrr teaser,rrr trailer,kgf 2 full movie,rrr vs kgf,kgf chapter 2 vs rrr,ఆర్ ఆర్ ఆర్‌,కెజియఫ్,కెజియఫ్2,
కెజియఫ్2 పోస్టర్ Photo : Twitter


 
First published: March 7, 2020, 1:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading