’కెజియఫ్ 2’కు అనుకోని షాక్.. షూటింగ్ ఆపాలంటూ కోర్ట్ ఆదేశం..

అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని ఓ సినిమాలో త్రివిక్రమ్ రాసాడు. ఇది కెజియఫ్ సినిమాకు అక్షరాలా సరిపోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 3:07 PM IST
’కెజియఫ్ 2’కు అనుకోని షాక్.. షూటింగ్ ఆపాలంటూ కోర్ట్ ఆదేశం..
బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్: KGF
  • Share this:
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని ఓ సినిమాలో త్రివిక్రమ్ రాసాడు. ఇది కెజియఫ్ సినిమాకు అక్షరాలా సరిపోతుంది. ముందు ఈ సినిమా వస్తున్నపుడు కన్నడ ప్రేక్షకులు తప్ప మిగిలిన భాషల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వచ్చిన తర్వాత ఈ చిత్రం సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పుణ్యమా అని కన్నడ సినిమా కూడా బాలీవుడ్‌లో జెండా పాతేసింది. ఇక ఇప్పుడు కెజియఫ్ 2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రాన్ని వీలైనంత వేగంగా చిత్రీకరిస్తున్నాడు ఈయన.
KGF 2 movie Shooting stopped by Court and huge shock to Yash Fans pk అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని ఓ సినిమాలో త్రివిక్రమ్ రాసాడు. ఇది కెజియఫ్ సినిమాకు అక్షరాలా సరిపోతుంది. kgf 2,kgf chapter 2,kgf chapter 2 shooting,kgf chapter 2 movie shooting,kgf chapter 2 movie,kgf chapter 2 court case,kgf chapter 2 case,yash kgf chapter 2,kgf chapter 2 twitter,kgf chapter 2 sanjay dutt,telugu cinema,యశ్,కెజియఫ్ 2,కెజియఫ్ 2 షూటింగ్,కోర్టు కేసులో ఇరుక్కున్న కెజియఫ్ 2
సంజయ్ దత్ కేజీయఫ్ 2

దీనిపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతా సాఫీగా సాగిపోతున్న ఈ సమయంలో ఈ చిత్రానికి ఇప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు తెలుస్తుంది. కెజియఫ్ 2 షూటింగ్ ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో జరుగుతోంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌ కారణంగా అక్కడి పర్యావరణానికి హాని కలుగుతుందంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. న్యాయస్థానం కూడా ఈయన పిటిషన్ గురించి ఆలోచించింది. అక్కడ జరుగుతున్న కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ను ఆపాలని ఆదేశాలిచ్చింది. ఇదే ఇప్పుడు చిత్రయూనిట్‌కు కోలుకోలేని విషయం.

KGF 2 movie Shooting stopped by Court and huge shock to Yash Fans pk అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని ఓ సినిమాలో త్రివిక్రమ్ రాసాడు. ఇది కెజియఫ్ సినిమాకు అక్షరాలా సరిపోతుంది. kgf 2,kgf chapter 2,kgf chapter 2 shooting,kgf chapter 2 movie shooting,kgf chapter 2 movie,kgf chapter 2 court case,kgf chapter 2 case,yash kgf chapter 2,kgf chapter 2 twitter,kgf chapter 2 sanjay dutt,telugu cinema,యశ్,కెజియఫ్ 2,కెజియఫ్ 2 షూటింగ్,కోర్టు కేసులో ఇరుక్కున్న కెజియఫ్ 2
‘కేజీఎఫ్’చాఫ్టర్

ఉన్నట్లుండి షూటింగ్ ఆగిపోవడంతో ప్రస్తుతం దానికి సరిపోయే మరో ప్లేస్ వెతికే పనిలో పడ్డారు చిత్రయూనిట్. అనుకోకుండా తగిలిన ఈ షాక్‌తో ఇఫ్పుడు విడుదల ఆలస్యం కావడమే కాదు.. బడ్జెట్ కూడా మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఇది నిజంగానే ఇప్పుడు షాకింగ్ న్యూస్. ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈయన అధీరా లుక్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. ఇదే ఏడాది సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి ఏం అవుతుందో చూడాలిక.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...