Jabardast: సుధీర్‌కు అతడే కరెక్ట్ మొగుడు.. 'జబర్దస్త్‌'లో కొత్త కుర్రాడి రచ్చ..!

సుడిగాలి సుధీర్ టీమ్

తెలుగులో నంబర్ వన్ కామెడీ షో అయిన ‘జబర్దస్త్‌’ (Jabardast)గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజుకు రోజుకూ కొత్త కొత్త కాన్సెప్ట్‌తో కంటెస్టెంట్స్.. ప్రేక్షకులను ఆకట్టకుంటున్నారు. ఇలా చేస్తూ వస్తున్నారు కాబట్టే విజయవంతంగా 400 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకోవడం జరిగింది

 • Share this:
  Jabardast: తెలుగులో నంబర్ వన్ కామెడీ షో అయిన ‘జబర్దస్త్‌’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజుకు రోజుకూ కొత్త కొత్త కాన్సెప్ట్‌తో కంటెస్టెంట్స్.. ప్రేక్షకులను ఆకట్టకుంటున్నారు. ఇలా చేస్తూ వస్తున్నారు కాబట్టే విజయవంతంగా 400 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక్క తెలుగులోనే కాదు వరల్డ్ వైడ్, ఇండియాలో కూడా ఎక్కడా ఈ రేంజ్‌లో ఎపిసోడ్‌లను పూర్తి చేసుకున్న కామెడీ షో లేదంటే అటు యూ ట్యూబ్‌లో.. ఇటు టీవీల్లో జనాలు ఏ రేంజ్‌లో చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే.. ఒకరిని మించి మరొకరు.. స్కిట్‌లు చేస్తూ కామెడీ పంచ్‌లతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇప్పటి వరకూ హైపర్ ఆదీ టీమ్, సుడిగాలి సుధీర్ మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తూ వస్తున్నారు. మిగిలిన టీమ్‌లతో పోలిస్తే ఈ టీమ్ లీడర్స్, కంటెస్టెంట్లతో ఓ రేంజ్‌లో స్కిట్‌లు చేసేవారు. ఎక్కువగా ఈ టీమ్సే స్కిట్‌లు కొట్టేవి. అయితే ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. చిన్న టీమ్ ఇప్పుడు ఏకంగా నాలుగైదు స్థానాలు ఎగబాకి సుడిగాలి సుధీర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

  ఇంతకీ ఏ టీమ్ అని ఆలోచిస్తున్నారు కదూ.. అదేనండోయ్.. కెవ్వు కార్తిక్ టీమ్. ఇప్పటి వరకూ అవినాష్ టీమ్‌లో ఒక మెంబర్‌గా ఉన్న కెవ్వు కార్తిక్.. ఆయన బిగ్‌బాస్ షోకు వెళ్లేసరికి టీమ్ లీడర్ అయ్యాడు. కేవలం వంద రోజుల్లోనే సుమారు ఆరు స్కిట్‌లకు పైగానే కొట్టాడు. అందులో కొన్ని హ్యాట్రిక్ కావడం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే కార్తిక్‌కు ఈ స్కిట్‌లు కొట్టడానికి.. సుడిగాలి సుధీర్ స్థానాన్ని ఈ టీమ్ కైవసం చేసుకోవడానికి కొత్త కుర్రాడు ఇమ్మాన్యుయేలే కారణం.

  Jabardast episodes, Jabardast contestants, Sudheer Team Jabardast, Kevvu Karthik Team, Emmanuel Jabardast, Sudheer team Emmanuel, జబర్దస్త్, జబర్దస్త్ సుధీర్ టీమ్
  కెవ్వు కార్తీక్


  ఇతను వేసే పంచ్‌లు, యాక్టింగ్‌ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని.. మళ్లీ మళ్లీ స్కిట్‌లు చూస్తున్నారు. ఆఖరికి లేడీ గెటప్‌లోనూ ఇమ్ము తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇలా చేశాడు కాబట్టే కార్తిక్ టీమ్ వరుస స్కిట్‌లు కొట్టడానికి కారకుడయ్యాడు. అందుకే అవినాష్ షో నుంచి బయటికెళ్లాక కార్తిక్‌ టీమ్‌కు మంచి రోజులొచ్చాయని కొందరు ప్రేక్షకులు, అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. ఇమ్ము గర్ల్‌ఫ్రెండ్ వర్ష కూడా ఈ టీమ్‌కు ఒక అసెట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇమ్ము.. ఇమ్ము అనే పేరే ఎక్కువగా అనిపిస్తోంది.

  Jabardast episodes, Jabardast contestants, Sudheer Team Jabardast, Kevvu Karthik Team, Emmanuel Jabardast, Sudheer team Emmanuel, జబర్దస్త్, జబర్దస్త్ సుధీర్ టీమ్
  కెవ్వు కార్తీక్ టీమ్


  అలా తన నటన, పంచ్‌లతో ఇరగదీస్తున్న ఇమ్ము.. ఇప్పుడు సుడిగాలి సుధీర్‌ టీమ్‌కు మొగుడిలా మారిపోయాడు. గత కొన్ని రోజులుగా ఈ టీమ్‌ వరుసగా స్కిట్‌లు కొట్టడమే కాకుండా.. స్కిట్‌లను యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో పెట్టడానికి కారకుడయ్యాడు. దీంతో ఇప్పటి వరకూ ఆది తర్వాత స్థానంలో ఉన్న సుడిగాలి టీమ్‌లో ఆలోచనలో పడిందట. అందుకే ఇకపై మరింత డోస్ పెంచి ఆటో పంచ్‌లు పేల్చాలని రామ్ ప్రసాద్, గెటప్ శీను అనుకుంటున్నారట.

  ఇప్పట్లో సుడిగాలి టీమ్‌ అలెర్ట్ కాకపోతే మున్ముంథు పూర్తిగా ఈ టీమ్‌ను తొక్కేసి నంబర్ వన్ స్థానానికి పోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదు.. అదే ఉంటే దునియాను ఏలేయచ్చన్న మాటను ఇమ్మాన్యుయేల్ నిజం చేసి చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో.. జబర్దస్త్ స్టేజ్‌ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.. ఎంతో మంది కొత్త కంటెస్టెంట్లకు చోటిచ్చింది. అలా వచ్చిన ఇమ్ము ఇప్పుడు ఇప్పటి వరకూ ఉన్న సీనియర్లకే ఎసరు పెట్టేలా ఉండటం మిగిలిన టీమ్ మెంబర్స్‌ అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది.
  Published by:Manjula S
  First published: