సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఇప్పటివరకు చాలా విన్నాం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మనం వీటి గురించి వింటూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అన్న వాళ్లు లేకపోలేదు. అయితే ఇప్పుడు...తాజాగా ఓ ఘటన చూస్తే... ఒక్క మహిళలకే కాదు... పురుషులకు కూడా సినీ ఇండస్ట్రీలు వేధింపులు ఉంటాయని తెలిసింది. సినిమాలో నటించమని చెప్పి... తనను అడల్ట్ సీన్లలో నటించాలని ఒత్తిడికి గురి చేశాడంటూ... ఓ బాధితుడు పోలీసులకు మొర పెట్టుకున్నాడు.
తాను అలాంటి సినిమాల్లో సీన్లలో నటించనని నెత్తి నోరు బాదుకున్నా.... మహిళా దర్శకురాలు మాత్రం అతడ్ని వదల్లేదు. తాను చెప్పినట్టు ఆ బూతు సినిమాలో నటించాల్సిందేనంటూ.. ఆ నటుడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. లేకపోతే రూ. 5 లక్షలు కట్టమని బెదిరించింది. దీంతో.. అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అతడు ఒక బుల్లితెర నటుడు. సినిమాల్లో రాణించాలనేదే అతని కల. ఈ క్రమంలో ఆయన సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. ఒక సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. తమ వద్ద ఒక సినిమా ఆఫర్ ఉందని, మంచి రెమ్యునరేషన్ కూడా ఇస్తామని ఓ మహిళా దర్శకురాలు అతడ్ని సంప్రదించింది. అయితే.. ముందుగా అగ్రిమెంట్‌లో సంతకం చేయాలని చెప్పింది. తనకు ఆఫర్ వచ్చిందన్న ఆనందంలో.. ఆ అగ్రిమెంట్‌లో ఏముందో చదవకుండానే ఆ నటుడు సంతకం చేశాడు.
ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలయ్యింది. కట్ చేస్తే.. షూటింగ్‌లో పాల్గొనేందుకు అతడు సెట్స్‌కి వెళ్లాడు. అప్పుడు అతనికి అసలు విషయం తెలిసింది. తాను చేస్తోంది సాధారణ సినిమా కాదు, ఒక అడల్ట్ సినిమా అని. ఓ గదిలోకి తీసుకెళ్లి నగ్నంగా నటించాలని చెప్పారు. దీంతో అతడు షాక్ అయ్యాడు. అడల్ట్ సినిమా అయితే తాను చేయనని, వెళ్లిపోతానని అన్నాడు. కానీ.. ఆ మహిళా దర్శకురాలు అతడ్ని వదల్లేదు. షూటింగ్ చాలా మారుమూల ప్రాంతంలో జరుగుతుండటంతో అక్కడి నుంచి బాధితుడు తప్పించుకోలేకపోయాడు.
అదీకాకుండా అగ్రిమెంట్‌పై సంతకం చేశావు కాబట్టి, తాము చెప్పినట్లుగానే బూతు సినిమాలో నటించాల్సిందేనని, లేకపోతే.. రూ. 5 లక్షలు కట్టమని లేడీ డైరెక్టర్ అతడ్ని చెప్పింది. దీంతో చేసేదేమీ లేక, అతడు షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి, గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mollywood, Movie News