అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వం అరుదైన గౌరవం

మలయాళంలో బన్ని సినిమాలు అక్కడి స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్స్ కొల్లకొడుతున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్‌కు కేరళ అభిమానులు ముద్దుగా ‘మల్లు అర్జున్‌’గా పిలుస్తుంటారు.కేరళలో అల్లు అర్జున్‌కున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం అక్కడ జరగబోయే పడవ పోటీలకు అతన్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది.

news18-telugu
Updated: November 6, 2018, 12:25 PM IST
అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వం అరుదైన గౌరవం
అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వ ఆహ్వానం
  • Share this:
టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. మలయాళంలో బన్ని సినిమాలు అక్కడి స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్స్ కొల్లకొడుతున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్‌కు కేరళ అభిమానులు ముద్దుగా ‘మల్లు అర్జున్‌’గా పిలుస్తుంటారు.

కేరళలో అల్లు అర్జున్‌కున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం అక్కడ జరగబోయే పడవ పోటీలకు అతన్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం తనకు దక్కిన  గౌరవంగా భావించి ఈ ఈవెంట్‌కు అటెండ్ కానున్నాడు  బన్ని.

అల్లు అర్జున్


దాదాపు 65 ఏళ్ల నుంచి కేరళలో ఈ బోట్ రేసింగ్ జరుగుతోంది. నవంబర్ 10న 66వ బోట్ రేసింగ్‌ జరగనుంది. అలెప్పిలో నిర్వహించనున్న ఈ పోటీలో మొత్తంగా 81 బోట్లు పోటీ పడనున్నట్టు సమాచారం.అల్లు అర్జున్ ట్విట్టర్ ఫోటో


బన్ని సినిమాల విషయానికొస్తే...‘నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా’ తర్వాత ఏ మూవీకి ఓకే చెప్పని  అల్లు అర్జున్...త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు డిసెంబర్‌లో కొబ్బరికాయ కొట్టనున్నాడు.ఈ మూవీలో బన్ని సరసన కియార అద్వానీ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.
First published: November 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>