త్వరలో మద్యం సూపర్ మార్కెట్లు...మందు బాబులకు ఇక పండగే...
కేరళ బెవెరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులలో మార్పులు తెస్తామని వైన్ షాపుల ముందు ప్రజలు బారులుతీరి నిలబడకుండా సూపర్ మార్కెట్ తరహాలో వైన్ షాపులను నెలకొల్పుతామని అన్నారు.
news18-telugu
Updated: November 11, 2019, 7:26 PM IST

ప్రతీకాత్మకచిత్రం
- News18 Telugu
- Last Updated: November 11, 2019, 7:26 PM IST
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళలో మద్యం సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని అన్నారు. అంతేకాదు పబ్‌లను ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు. ముఖ్యంగా వారాంతంలో ఆటవిడుపుగా ఉండేలా పబ్‌లను ప్రారంభించే యోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. పబ్స్ ఓపెన్ చేసే ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విజయన్ తెలిపారు. అంతేకాదు మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు వీలుగా మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. కేరళ బెవెరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులలో మార్పులు తెస్తామని వైన్ షాపుల ముందు ప్రజలు బారులుతీరి నిలబడకుండా సూపర్ మార్కెట్ తరహాలో వైన్ షాపులను నెలకొల్పుతామని అన్నారు. తద్వారా మందుబాబు తమకు నచ్చిన మద్యాన్ని ఈ షాపులలో ఎంపిక చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
అదే ఫైనల్ కాదు.. శబరిమలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఆకలి ఎంత పనిచేసింది.. ఆ చిన్నారులు అలా కడుపు నింపుకున్నారు
Sabarimala Bike Rent: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్... బైక్ అద్దెకు తీసుకోవచ్చు
శబరిమల పర్యటనలో ఆంధ్ర అయ్యప్ప భక్తుడు మృతి...
IRCTC: విశాఖపట్నం నుంచి కేరళకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
క్లాస్‌రూమ్‌లో పాము కాటు.. టీచర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి
Loading...