రజనీ కోసం మణిరత్నం సినిమాను వదులుకున్న కీర్తి సురేష్..

'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ సూపర్ బిజీ అయిపోయింది. అంతేకాదు దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తోంది.

news18-telugu
Updated: December 16, 2019, 8:36 AM IST
రజనీ కోసం మణిరత్నం సినిమాను వదులుకున్న కీర్తి సురేష్..
Instagram
  • Share this:
'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ సూపర్ బిజీ అయిపోయింది. అంతేకాదు దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తోంది. రామ్ హీరోగా వచ్చిన 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి.. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన నేను లోకల్‌లో అదరగొట్టింది. అయితే 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తోంది. అది అలా ఉంటే కీర్తికి రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘సిరుతై’ శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన 168వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి, సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు కీర్తి మణిరత్నం సినిమాలో నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు మణిరత్నం ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో మొదలైంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్‌, కీర్తి సురేశ్‌, మోహన్‌బాబు, కార్తీ, జయంరవి, అమితాబ్‌ బచ్చన్‌‌లు కీలక పాత్రల్నీ పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు కీర్తి సురేష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నదని తెలుస్తోంది.

ఆ సినిమా నుండి తప్పుకోవడానికి కారణమేమిటంటే.. కీర్తి సురేశ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంతోపాటు రజనీకాంత్ 168వ సినిమాలో నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలకు డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో  కీర్తి మణిరత్నం సినిమా నుంచి తప్పుకొన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. కీర్తి రజనీకాంత్ 168 చిత్రంతోపాటు ‘పెంగిన్వ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాతో పాటు కీర్తి అజయ్‌ దేవగణ్‌  ‘మైదాన్‌’లో నటిస్తున్నారు.
చీరలో అదిరిన కియారా అందాలు...First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు