సూపర్ స్టార్ సినిమా నుంచి తప్పుకున్న కీర్తి సురేష్..

కీర్తి సురేష్ సూపర్ స్టార్ సినిమా నుంచి పక్కకు తప్పుకోవడం సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 18, 2020, 12:13 PM IST
సూపర్ స్టార్ సినిమా నుంచి తప్పుకున్న కీర్తి సురేష్..
కీర్తి సురేష్ (Twitter/Photo)
  • Share this:
కీర్తి సురేష్ సూపర్ స్టార్ సినిమా నుంచి పక్కకు తప్పుకోవడం సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది.  అంతేకాదు ఈ భామకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బరువు కూడా తగ్గింది. 1952 నేపథ్యంలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొద్ది భాగం షూట్ చేసిన తర్వాత  ఈ సినిమాలోని పాత్రకు కీర్తి సురేష్ సరిపోవడం లేదని దర్శక,నిర్మాతలతో పాటు కీర్తి సురేష్  ఓ అభిప్రాయానికి వచ్చిందట. అంతేకాదు అజయ్ దేవ్‌గణ్ సరసన కీర్తి మరి చిన్నపిల్లలా కనిపించడంతో బాలీవుడ్ ఎంట్రీకి ఇది సరైన సినిమా కాదనే అభిప్రాయంతో కీర్తిసురేష్ వచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి  స్వచ్ఛందంగా పక్కకు తప్పుకున్నట్టు  తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఆమె ప్లేస్‌లో సోనాక్షి సిన్హాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. మరోవైపు కీర్తి సురేష్.. రజినీకాంత్ కొత్త చిత్రంలో కీలక  పాత్రలో నటిస్తోంది.

 

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు