Home /News /movies /

Keerthy Suresh: 'వైరల్'గా మారిన కీర్తి సురేష్ వీడియో.. కరోనాను తరిమికొట్టాలంటే ఇలా చేయండంటూ?

Keerthy Suresh: 'వైరల్'గా మారిన కీర్తి సురేష్ వీడియో.. కరోనాను తరిమికొట్టాలంటే ఇలా చేయండంటూ?

Earthy Suresh

Earthy Suresh

Keerthy Suresh: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దేశం మొత్తం భయాందోళనకు గురవుతుంది. రోజురోజుకు కేసులు పెరగడమే కాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

    Keerthy Suresh: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దేశం మొత్తం భయాందోళనకు గురవుతుంది. రోజురోజుకు కేసులు పెరగడమే కాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఒకవైపు వ్యాక్సిన్ అందిస్తూనే ఉండగా.. మరోవైపు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రభుత్వం లాక్ డౌన్ కూడా విధించింది. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలు కూడా లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రెటీలకు, దర్శకనిర్మాతలకు వైరస్ వ్యాపించగా కొందరు బయట పడుతున్నారు. మరి కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక షూటింగులు వాయిదా పడటంతో సెలబ్రేటిలంతా ఇంట్లో ఉంటూ కరోనా జాగ్రత్తలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ నటి కీర్తి సురేష్ కూడా కోవిడ్ జాగ్రత్తలను తన భాషలో తెలుపుతూ బాగా ఆకట్టుకుంది.

    తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదిక ద్వారా ఓ వీడియో అభిమానులతో పంచుకోగా.. అందులో వైరస్ నుంచి రక్షించుకోవడానికి పలు జాగ్రత్తలు తెలిపింది కీర్తి సురేష్. కరోనా అడ్డుకట్ట వేయడానికి బాధితుల సంఖ్య తగ్గించడానికి డబుల్ మాస్క్ ధరించాలని, శానిటైజర్ ను ఉపయోగించాలని తెలిపింది. అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలి అంటూ ఎక్కువ జనం ఉన్న ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలని కోరింది.




    ప్రభుత్వం చేపట్టిన నిబంధనలను తప్పకుండా పాటించడం ముఖ్యమైనదని.. తాను కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపింది. ఇక అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ ను కొంత వరకు తగ్గించవచ్చని.. మన ఫ్యామిలీని మనం రక్షించుకోవచ్చు అని కొన్ని విషయాలు పంచుకుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. తన మాతృభాషతో ఎంతో చక్కగా వివరించింది. ఈ వీడియోను చూసిన నెటి జనలు కీర్తి సురేష్ చెప్పిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Corona time, Covid-19, DOUBLE MASK, Keerthy Suresh, Mahanati, Sarkaru vari pata, Tollywood heroine, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు