ప్రెగ్నెంట్‌ లేడీగా కీర్తి సురేష్.. పెంగ్విన్ మూవీ టైటిల్ లుక్ ఇదిగో

టైటిల్ లుక్‌లో తన గర్భంపై చేయి వేసి పర్వత ప్రాంతంలో నిలబడింది కీర్తి సురేష్. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు.

news18-telugu
Updated: October 17, 2019, 8:22 PM IST
ప్రెగ్నెంట్‌ లేడీగా కీర్తి సురేష్.. పెంగ్విన్ మూవీ టైటిల్ లుక్ ఇదిగో
instagram
news18-telugu
Updated: October 17, 2019, 8:22 PM IST
'మహానటి' కీర్తి సురేష్ బర్త్ డే సంద్భంగా ఆమె అభిమానులకు అద్దిరిపోయే గిఫ్ట్..! కీర్తి లీడ్ రోల్‌లో నటిస్తున్న పెంగ్విన్ మూవీ టైటిల్ లుక్‌ని చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఆ టైటిల్ లుక్‌ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది కీర్తి సురేష్. అందులో గర్భం దాల్చిన మహిళగా కీర్తి సురేష్ కనిపించిది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆమె రూపం పెంగ్విన్ పక్షిలా ఉంది. టైటిల్ లుక్‌లో తన గర్భంపై చేయి వేసి పర్వత ప్రాంతంలో నిలబడింది కీర్తి సురేష్. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. పెంగ్విన్ సినిమాకు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయన్ సంతానం, కాల్ రామన్, ఎస్.సోమసేగెర్, కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ మూవీని విడుదల చేయబోతున్నారు. పెంగ్విన్‌తో పాటు మిస్ ఇండియా సినిమాలోనూ కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి నగేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కావడం విశేషం.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...