ఆ విషయంలో కీర్తి సురేష్‌ని చూసి ఆశ్చర్యం వేసింది..

Keerthy Suresh :  కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్స్‌లలో ఒకరుగా ఉన్నారు. 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఈ భామ.

news18-telugu
Updated: October 21, 2019, 12:07 PM IST
ఆ విషయంలో కీర్తి సురేష్‌ని చూసి ఆశ్చర్యం వేసింది..
Instagram/eerthysureshofficial
  • Share this:
Keerthy Suresh :  కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా ఉన్నారు.  తెలుగు సినిమా 'మహానటి'తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కీర్తి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది.  'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి సురేష్ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.
అయితే.. కీర్తి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ‘మిస్ ఇండియా’ కూడా ఒకటి. ఈ సినిమా కోసం కీర్తి చాలానే కష్టపడింది. ఈ సినిమాలో డిఫరెంట్ టైమ్ పిరియడ్స్ లో డిఫరెంట్ లుక్స్ డిమాండ్ చేయడంతో.. ఆయా లుక్స్‌లో  కనిపించాల్సి ఉండటంతో బరువు తగ్గిన కీర్తి,. లుక్స్ కోసం అనేక లుక్ టెస్ట్స్ చేయించుకుందట. ఒక్కో లుక్ కోసం కనీసం 10 టెస్ట్స్ చేశారని.. అలా మొత్తం 50కి పైగా లుక్ టెస్ట్స్ జరిగాయని అంటున్నాడు ఈ సినిమా డైరెక్టర్ నరేంద్ర నాథ్. అయితే.. అన్నిటిలోనూ కీర్తి సురేష్ చాలా ఓపిగ్గా పాల్గొందని, సినిమాలో ఆమె లుక్స్ చాలా గొప్పగా ఉంటాయని అంటున్నారు. కీర్తి ఆ పాత్రలో ఒదిగిపోవడం చూసి ఆశ్చర్యం వేసిందని దర్శకుడు నరేంద్ర నాథ్ చెప్పుకొచ్చారు. 
View this post on Instagram
 

A sneak peek from #MissIndia 😊 @eastcoastprdns @smkoneru @narencloseup @musicthaman


A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on
‘మిస్ ఇండియా’ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో కీర్తితో పాటు నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లుక్‌ను ఇటీవలే కీర్తి బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఆ లుక్‌లో కీర్తి సన్నగా మారి స్టైలీష్‌ లుక్‌లో అదరగొడుతోంది. 
View this post on Instagram
 

#MissIndia 😊 @narencloseup @tharundirects @musicthaman @smkoneru @gopiprasannaa @styledbyindrakshi #titlerelease #MissIndia


A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

కీర్తి సురేష్.. అదిరిపోయే పిక్స్
Published by: Suresh Rachamalla
First published: October 21, 2019, 12:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading