అలిమేలుమంగ పాత్రలో కీర్తి సురేష్.. యాక్షన్ హీరో సరసన..

Keerthy Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా రాణిస్తోంది.

news18-telugu
Updated: July 15, 2020, 2:00 PM IST
అలిమేలుమంగ పాత్రలో కీర్తి సురేష్.. యాక్షన్ హీరో సరసన..
కీర్తి సురేష్ Photo : Twitter
  • Share this:
కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా రాణిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో కీర్తి సౌత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో తన నటనకు కీర్తికి జాతీయ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత నుండి కీర్తి నటన ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన రంగ్ దే, మహేష్ సర్కారు వారి పాటలో నటిస్తోన్న కీర్తికి తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ సరసన నటించే అవకాశం వచ్చింది. తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'అలిమేలుమంగ వేంకటరమణ' పేరిట ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా అనుష్క పేరు మొదట వినపడినా చివరకు ఆ అవకాశం కీర్తి సురేష్‌కు వచ్చినట్లు సమాచారం. ఇక గత కొన్నేళ్లుగా యాక్షన్ చిత్రాలలోనే ఎక్కువగా నటించిన గోపీచంద్‌కు ఈ సినిమా కొంత వైరటీగా ఉండనుందట. ఈ సినిమా ఆయన గత చిత్రాలతో పోల్చితే.. కొంత కొత్తగా ఉంటూ పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డ్రామాతో సాగనుందట. ఈ సినిమాకు సంబందిచి ఇప్పటికే స్క్రిప్టు పని పూర్తిచేసిన తేజ.. ఇతర నటీనటులు, టెక్నికల్ సిబ్బందిని సమకూర్చుకునే పనిలో ఉన్నాడట. గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు.  తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: July 15, 2020, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading