news18-telugu
Updated: July 3, 2020, 6:59 AM IST
కీర్తి సురేష్ Photo : Twitter
Keerthy Suresh : 'మహానటి' సినిమాతో మంచి నటిగా పేరుతెచ్చుకుని జాతీయ అవార్డు సైతం అందుకున్న నటి కీర్తి సురేష్.. ఇటు తెలుగు చిత్రాలతో పాటు, అటు తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తోంది. 'మహానటి'తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కీర్తి. 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి సురేష్ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే'లో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయనుంది కీర్తి. 'రంగ్ దే' తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన 'పవర్ పేట' చేస్తున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించనుందట. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని సమాచారం. ఇక తెలుగులో గుడ్ లక్ సఖీతో పాటు మిస్ ఇండియా సినిమాల్లో కీర్తి నటిస్తోంది. ఇక్కడ మరో విశేషమేమంటే మహేష్ బాబు సర్కారు వాటి పాటలో కూడా కీర్తి హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.
First published:
July 3, 2020, 6:59 AM IST