Keerthy Suresh : చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్.. నో చెప్పిన సాయి పల్లవి..

చిరంజీవి, కీర్తి సురేష్ Photo : Twitter

Chiranjeevi : చిరంజీవి తమిళంలో అజీత్ హీరోగా సూపర్ హిట్ అయినా వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి ఇటీవల అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన చిత్రం పెంగ్విన్. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్‌లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరవాలేదని పించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మిస్ ఇండియా.. మహిళలపై జరిగే వేధింపుల నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదలకానుందని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదట. మిస్ ఇండియాను డైరెక్ట్‌గా థియేటర్‌లోనే విడుదల చేస్తారట. ఈ సినిమాలతో పాటు కీర్తి సురేష్ మరో సినిమాలో నటిస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

    అది అలా ఉంటే కొన్నాళ్లు రాజకీయం చేసిన చిరంజీవి కొంత గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలను చేస్తున్నాడు. అందులో భాగంగా ఆ మధ్య వచ్చిన ఖైదీ నెం.150తో హిట్ కొట్టాడు. ఆ తరువాత భారీ బడ్జెట్‌తో తీసిన సైరా నరసింహా రెడ్డి సినిమా పవరలేదనిపించింది. ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంతగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టి కొంత భాగం షూటింగ్ చేసినా తర్వాత కరోనా లాక్ డౌన్ విధించారు.

    ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్’లో సడలింపులు ఇవ్వడంతో టాలీవుడ్‌లో షూటింగ్స్ మళ్లి మొదలైయాయి. అందులో భాగాంగా ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి పున: ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే చిరంజీవి తమిళంలో అజీత్ హీరోగా సూపర్ హిట్ అయినా వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కథ ప్రకారం హీరోకు చెల్లెలు ఉంటుందట. దీంతో ఆ సిస్టర్ క్యారెక్టర్‌లో ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు మెహర్ రమేష్‌ సాయిపల్లవికి కథ చెప్పడం.. ఆమె ఓకే చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలింది. అంతేకాదు ఆమె ఈ పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ను కీర్తి సురేష్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కీర్తి సురేష్ తమిళంలో రజనీకాంత్‌కు సోదరిగా ఓ సినిమాలో చేస్తుండటంతో ఆమె ఈ పాత్రను చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పటిదాకా కీర్తికి కథ చెప్పలేదట.. త్వరలోనే చెప్పనున్నాడట దర్శకుడు. కీర్తి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారు వారి పాటలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో అమెరికాలో మొదలుకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: