సూపర్ స్టార్‌తో కీర్తి సురేష్ రొమాన్స్..

కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లల ఒకరు. కీర్తి 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

news18-telugu
Updated: December 9, 2019, 6:16 PM IST
సూపర్ స్టార్‌తో కీర్తి సురేష్ రొమాన్స్..
Instagram/keerthysureshofficial
  • Share this:
కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లల ఒకరు. కీర్తి 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. కీర్తికి ఈ సినిమాలో నటనకు జాతీయ పురస్కారం కూడ లభించింది. రామ్ హీరోగా వచ్చిన 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది కీర్తి. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన నేను లోకల్‌లో అదరగొట్టింది. అయితే 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తోంది. అది అలా ఉంటే కీర్తికి రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘సిరుతై’ శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన 168వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి, సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే కార్తీ ఖైదీ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలోనూ కీర్తిసురేష్‌ నటించే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి.


కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. కీర్తితో పాటు ఈ సినిమాలో నవీన్ చంద్ర, జగపతిబాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

జిమ్‌లో దుమ్ములేపుతున్న అంజలి..
First published: December 9, 2019, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading