నితిన్‌తో మరోసారి రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్..

కీర్తి ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే'లో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

news18-telugu
Updated: May 8, 2020, 7:40 AM IST
నితిన్‌తో మరోసారి రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్..
కీర్తి సురేష్ (Keerthy suresh)
  • Share this:
కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తోంది. తెలుగు సినిమా 'మహానటి'తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కీర్తి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది.  'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి సురేష్ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే'లో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయనుంది కీర్తి. 'రంగ్ దే' తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన 'పవర్ పేట' చేయనున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించనుందట. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని సమాచారం. ఇక కీర్తి ప్రస్తుతం 'మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నారు. మరోవైపు కీర్తి సురేష్ రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో కీలకరోల్‌ చేస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: May 8, 2020, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading