news18-telugu
Updated: March 1, 2020, 8:22 AM IST
గోపీచంద్, కీర్తి సురేష్ Photo : Twitter
Keerthy Suresh : కీర్తి సురేష్‌కు ఇటు అందంలో కానీ, అటూ నటనలో గానీ ఎదురులేదు. చక్కని ముఖారవిందంతో ఆకట్టుకుంటోన్న ఈ భామ ఓ హిందీ సినిమా కోసం సన్నగా మారీ తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ లుక్‌లో అంతగా ఆకర్షణీయంగా లేదు కీర్తి సురేష్ అని టాక్. అది అలా ఉంటే తెలుగులో 'నేనూ శైలజ' అంటూ రామ్ సరసన నటించినా కీర్తి సురేష్.. ఆ తర్వాత వచ్చిన 'మహానటి'తో ఎంతో పాపులర్ అయ్యింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది. మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. కీర్తి ప్రస్తుతం నితిన్‌తో ఓ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుండగా.. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తోన్న స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తోంది. ఆమె మరోవైపు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. గర్భవతిగా పెంగ్విన్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంతో వస్తోన్న ఓ సినిమాలో నటిస్తూ బిజీగా వుంది. కాగా మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ Photo : Twitter
దర్శకుడు తేజ తాజాగా రెండు సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి 'అలమేలు మంగ - వెంకటరమణ'. ఈ సినిమాలో హీరోగా గోపీచంద్ చేయనున్నాడు. హీరోయిన్ పాత్రకి కాజల్‌ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కీర్తి సురేష్ ఎంపికైనట్లు సమాచారం. దీనికి కీర్తి కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది.
Published by:
Suresh Rachamalla
First published:
March 1, 2020, 8:16 AM IST