Home /News /movies /

KEERTHY SURESH TO ACT IN KRITI SANON MIMI TELUGU REMAKE HERE ARE THE DETAILS SR

Keerthy Suresh : పెళ్లి కాకుండానే తల్లికానున్న కీర్తి సురేష్... ప్రయోగం ఫలిస్తుందా..

Keerthy Suresh Photo : Instagram

Keerthy Suresh Photo : Instagram

Keerthy Suresh : మహానటి సినిమా తర్వాత తెలుగులో సూపర్ పాపులర్ అయిన నటి కీర్తి సురేష్.. పెళ్లి కాకుండానే తల్లికానుందట.

    Keerthy Suresh : కీర్తి సురేష్‌..  'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి  పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కీర్తి సురేష్ నటిస్తోంది. పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్  అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్‌  (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట.

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక కీర్తి  (Keerthy Suresh good luck sakhi)నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖీ.. ఈ సినిమా ఓటీటీలో విడుదలకానుందని తెలుస్తోంది. గతంలో కీర్తి నటించిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా కూడా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించాయి. కరోనా కారణంగా ఈ సినిమాలు థియేటర్‌లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైయాయి.

    ప్రస్తుత సమయంలో ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ ఫైవ్‌లో స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నారు. నగేష్ కుకునూర్ గతంలో ‘హైదరాబాద్ బ్లూస్’, ‘తీన్ దీవారే’, ‘ఇక్బల్’ వంటి డిఫరెంట్ సినిమాలను తీసిన సంగతి తెలిసిందే. ఈ

    సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కనిపించనున్నారు. కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Keerthy Suresh, Kriti Sanon, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు