• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KEERTHY SURESH SWEET GESTURE MAKES A FAN HAPPY ON HER BIRTHDAY SR

Keerthy Suresh : కీర్తి సురేష్ మనసు వెన్నపూస.. అభిమాని స్పెషల్ కోరికను చిటికెలో తీర్చింది..

Keerthy Suresh : కీర్తి సురేష్ మనసు వెన్నపూస.. అభిమాని స్పెషల్ కోరికను చిటికెలో తీర్చింది..

కీర్తి సురేష్ Photo : Twitter

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. ఇప్పుడో సూపర్ స్టార్. తెలుగు తమిళ భాషాల్లో వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

  • Share this:
    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. ఇప్పుడో సూపర్ స్టార్. తెలుగు తమిళ భాషాల్లో వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసిన కీర్తి సురేష్... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ తన అభిమాని పుట్టినరోజున స్పెషల్ గ్రీటింగ్స్ తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కీర్తి సురేష్ అభిమాని ఒకరు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. దీంతో ట్విట్టర్‌లో కీర్తి సురేష్‌ను ట్యాగ్ చేస్తూ మేడమ్ నేను మీ అభిమానిని.. ఈరోజు పుట్టినరోజును జరపుకుంటున్నాను.. మీరు విష్ చేయండి మేడమ్ అంటూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన కీర్తి సురేష్ తన అభిమానికి వెంటనే పుట్టినరోజు విషేస్ తెలిపింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇది చూసిన నెటిజన్స్.. కీర్తి మనసు  బంగారం అంటున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మహానటితో జాతీయ అవార్డ్ పొందిన కీర్తి సురేష్ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకుంది కీర్తి. వివరాల్లోకి వెళితే.. ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన భారతదేశపు ప్రతిభావంతమైన యువ తారల వార్షిక జాబితాలో కీర్తి సురేష్‌కు చోటు దక్కింది.

    దేశవ్యాప్తంగా 30 సంవత్సరాలకు లోపల ఉన్న యువతి యువకులు తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభ చూపించిన వారిని షార్ట్ లిస్ట్ చేసి.. ఫోర్బ్స్ ఇండియా ఈ సంవత్సరం ఎవరెవరికి చోటు దక్కిందో ప్రకటించింది. ఈ జాబితాలో ముప్పైమందికి చోటు లభించగా.. కీర్తి సురేష్‌కు వినోద రంగంలో ఈ గుర్తింపు లభించింది.


    ఇక కీర్తీ సురేష్ సినిమాల విషయానికి వస్తే.. మహానటి తర్వాత ఆ స్థాయి విజయం ఇంతవరకు ఈమెకు రాలేదు. వరుసగా ఈమె చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన చిత్రం పెంగ్విన్. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరవాలేదని పించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మిస్ ఇండియా.. ఈ సినిమా కూడా ఓటీటీలో ఇటీవల విడుదలై తుస్సుమంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రెండు సినిమాలు పెద్దగా అలరించలేపోయింది.






    కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో రంగ్ దే అనే మరో సినిమాను చేస్తుంది. నితిన్ హీరోగా చేస్తున్నాడు. రంగ్ దే సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాతో పాటు కీర్తి చిరంజీవి తమిళ రీమేక్ వేదాళంలో కూడా నటించనుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు