'మహానటి'లో ఆ సీన్‌ కోసం చాలా కష్టపడాల్సీ వచ్చింది : కీర్తి సురేష్

Keerthy Suresh : ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లలో ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మాట్లాడిన కీర్తి 'మహానటి, సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంది.

news18-telugu
Updated: August 12, 2019, 9:36 AM IST
'మహానటి'లో ఆ సీన్‌ కోసం చాలా కష్టపడాల్సీ వచ్చింది : కీర్తి సురేష్
Instagram.com/keerthysureshofficial
  • Share this:
Keerthy Suresh : ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లలో ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డ్‌ల కోసం దేశవ్యాప్తంగా 2018లో విడుదలైన అన్ని భాషల్లోని సినిమాలను పరిగణలోకి తీసుకుని ప్రకటించారు. అయితే తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా దాదాపు 28 ఏళ్ల తర్వాత  ఈ పురస్కారం దక్కింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన 'మహానటి'లో కీర్తి సురేష్ నటనకు ఈ పురస్కారం లభించింది. ఇంతకు ముందు ఈ అవార్డ్ 1990లలో  లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ‘కర్తవ్యం’ చిత్రంలో తన నటనకు ఈ అవార్డు దక్కింది.  ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ కు పురస్కారం దక్కడం విశేషం.

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి మహానటి 'సావిత్రి'. ఆమె జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  బయోపిక్ ‘మహానటి’. ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ను సావిత్రి పాత్రలో చూపిస్తూ... సావిత్రి వాస్తవ జీవితంలో కీలక ఘట్టాలను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. జాతీయ అవార్డ్ వచ్చిన సందర్బంగా కీర్తి సురేష్ తన ఆనందాన్ని.. సినిమా చేస్తున్నప్పుడు ఎదుర్కోన్న అనుభవాలను పంచుకున్నారు.


 View this post on Instagram
 

#MahanationMay9th 😊


A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో మొదట 'మాయాబజార్‌' సినిమాలోని ఏడ్చే సీన్‌ను  చిత్రీకరించారని.. అయితే ఆ సీన్ కోసం చాలా టేక్స్‌ తీసుకున్నానని చెప్పింది. ఈ సీన్ కోసం ముందుగా చాలాసార్లు రిహార్సల్స్‌ చేశామని.. అయిన రెండు గంటలపాటు కేవలం ఎడమ కంటి నుంచి రెండు నీటి బొట్లు, కుడి కంటిలో ప్రేమ కనిపించే సీన్‌ కోసం చాలా కష్టపడ్డామని తెలిపింది కీర్తి. సావిత్రి పాత్ర కోసం దాదాపు వంద రకాలకు పైగా దుస్తులను ధరించానని చెబుతూ.. మొదటి రోజు షూటింగ్‌లో కేవలం మేకప్‌ కోసమే నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుందని చెప్పింది. షూటింగ్ అయిపోయే పది రోజుల ముందు బాధ మొదలైందని.. దీంతో షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత తట్టుకోలేక ఏడ్చేశానంది. అయితే 'మహానటి' సినిమా విడుదలైన తరువాత అభిమానులు.. విమర్శకులు మెచ్చుకోవడం ఎంతో సంతోషాన్ని.. హాయి నిచ్చాయంది కీర్తి .
First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు