రానా సినిమాకు నో చెప్పిన కీర్తి సురేష్... కారణం అదేనా..

Keerthy Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా ఉన్నారు. 

news18-telugu
Updated: September 20, 2019, 11:45 AM IST
రానా సినిమాకు నో చెప్పిన కీర్తి సురేష్... కారణం అదేనా..
Instagram
  • Share this:
Keerthy Suresh :  కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా ఉన్నారు.  తెలుగు సినిమా 'మహానటి'తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కీర్తి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాకు కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించిన విషయం తెలిసిందే. కాగా 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి సురేష్ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి , ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.


అది అలా ఉంటే.. అటు హీరోగా, ఇటు విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు రానా దగ్గుబాటితో ఓ సినిమాకి కీర్తి నో చెప్పిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి ఓ కొరియన్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. డ్రగ్ మాఫియా నేపధ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడానికి కీర్తి సురేష్‌ను సంప్రదించగా, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్న కీర్తి డేట్స్ లేని కారణంగా.. ఆ ఆఫర్‌కి నో చెప్పిందని టాక్. దీనికి ప్రధాన  కారణం ఆమెకు కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు అయ్యుండకపోవడమా? అన్నది తెలియరాలేదు. దీంతో ఇప్పుడు ఆ సినిమా దర్శకురాలు నందినీ రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారట. కీర్తి ప్రస్తుతం తెలుగులో 'మిస్ ఇండియా' చిత్రంతో పాటు.. హిందీలో అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో వస్తున్న  'మైదాన్' అనే సినిమాలో నటిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: September 20, 2019, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading