దీపికా పదుకోనే, అలియా భట్‌‌ అంటే చాలా ఇష్టం... కీర్తి సురేష్

Keerthy Suresh : కీర్తి సురేష్‌‌కు ‘మహానటి’ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న కీర్తి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది.

news18-telugu
Updated: August 31, 2019, 8:46 AM IST
దీపికా పదుకోనే, అలియా భట్‌‌ అంటే చాలా ఇష్టం... కీర్తి సురేష్
మహానటి నిర్మాత స్వప్న దత్‌తో కీర్తి Instagram./keerthysureshofficial
  • Share this:
Keerthy Suresh :  కీర్తి సురేష్‌.. 'మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'రంగ్‌దే‌'తో పాటు మరో సినిమా 'మిస్ ఇండియా' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలతో పాటు హిందీలో ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మైదాన్’ అనే సినిమా చేస్తోంది. అమిత్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, జాయ్ సేన్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ సరసన కీర్తి సురేష్  నటిస్తోంది. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లో కూడా పాగా వేస్తుందా లేదా అనేది చూడాలి.
అది అలా ఉంటే.. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా కీర్తి  ఇటీవల మీడియాతో మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. ఓ ప్రశ్నకు సమాధానంగా 'మహానటి'లో సావిత్రి పాత్రలో నటించాక మరొకరి జీవిత చరిత్రలో నటించడం కరెక్ట్ కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విలేకరి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఈ  తనకు హిందీలో ఇష్టమైన హీరో, హీరోయిన్‌ల గురించి మాట్లాడుతూ... బాలీవుడ్‌లో షారూఖ్‌ ఖాన్, దీపికాపదుకోనే, అలియాభట్‌ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కీర్తి మెయిన్ లీడ్‌గా చేస్తోన్న 'మిస్ ఇండియా' టీజర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటోంది.

Published by: Suresh Rachamalla
First published: August 31, 2019, 8:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading