అమెజాన్ ప్రైమ్‌లో కీర్తి సురేష్ పెంగ్విన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ తెలుగు సినిమా పెంగ్విన్ జూన్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది.

news18-telugu
Updated: May 18, 2020, 3:35 PM IST
అమెజాన్ ప్రైమ్‌లో కీర్తి సురేష్ పెంగ్విన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కీర్తి సురేష్ పెంగ్విన్ Photo : Twitter
  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.


ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని టాక్ నడిచింది. కానీ విడుదలకాలేదు. అయితే ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకుండా డెరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. అయితే తాజా సమాచారం మేరకు అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా ముందుగా డిజిటల్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెల 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో స్ట్రీమ్ కానుంది.  ఈ హవా హిందీలోను కూడా కనపడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈద్ సందర్భంగా మే 22న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ ఈ కరోనా వల్ల అది సాధ్యపడేలా లేదు.
Published by: Suresh Rachamalla
First published: May 18, 2020, 3:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading