మహానటితో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తిసురేశ్‌కు ఆ తర్వాత .. ఆమె క్రెడిట్‌ను మరింత పెంచేలా సినిమాలేవీ క్లిక్ కాలేదు. చేసిన సినిమాల్లో పెంగ్విన్, మిస్ ఇండియా ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. కానీ ఏవీ ప్రేక్షకాదరణను పొందలేదు. ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఓ సినిమాతో మెగా క్యాంప్ హీరోతో కీర్తిసురేశ్ జోడీ కడుతుందని సమాచారం. కీర్తిసురేశ్ నటించనున్న హీరో ఎవరో కాదు, సుప్రీమ్ హీరో సాయితేజ్ అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కోవిడ్ ప్రభావంతో బంద్ అయిన థియేటర్స్ ఇప్పుడే తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా విడుదలవుతున్న తెలుగు సినిమా సోలో బ్రతుకే సో బెటర్. సాయితేజ్ హీరోగా నటించిన సినిమా. డిసెంబర్ 25న సినిమా థియేటర్స్‌లో విడుదలవుతుంది.
ఈ సినిమా తర్వాత సాయితేజ్ రెండు సినిమాలను కమిట్ అయ్యున్నాడు. అందులో దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా. ఇందులో ఇప్పటికే హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక మిగిలిన రెండో సినిమా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనుంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఓ కన్ను, షట్చక్రంతో టైటిల్ లుక్ ఆసక్తిని రేపేలా ఉంది. ఈ సినిమాలో సాయితేజ్ జోడీగా కీర్తిసురేశ్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. సాధారణంగా మెగా క్యాంప్‌లో ఓ హీరోయిన్ అడుగు పెడితే .. ఆ హీరోలే తమ సినిమాల్లో సదరు హీరోయిన్‌కు అవకాశాలు ఇస్తారు. కీర్తి విషయంలోనూ అదే ఫార్ములా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
మరో వైపు దేవాకట్టా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారు. ఇందులో సాయితేజ్ యంగ్ ఐఏయస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌కు వెళ్లబోయే సాయితేజ్ నెక్ట్స్ మూవీ ఇదే. దాదాపు ఆరు డిజాస్టర్స్ తర్వాత సాయితేజ్ గత ఏడాది రెండు సూపర్‌హిట్స్‌ను దక్కించుకున్నారు. అందులో ముందుగా చిత్రలహరి ఉంది. ఆ తర్వాత వచ్చిన ప్రతిరోజూ పండుగే చిత్రం సాయితేజ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మరి ఈ సక్సెస్‌ను సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో సాయితేజ్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ఇందులో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తుంది.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.