హోమ్ /వార్తలు /సినిమా /

Keerthy Suresh : కీర్తి సురేష్‌కు తెలిసిసొచ్చిందట.. ఇక ఆ సినిమాలకు బైబై...

Keerthy Suresh : కీర్తి సురేష్‌కు తెలిసిసొచ్చిందట.. ఇక ఆ సినిమాలకు బైబై...

కీర్తి సురేష్ Photo : Twitter

కీర్తి సురేష్ Photo : Twitter

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ఇమేజ్ ఎంతగా పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ఇమేజ్ ఎంతగా పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి తర్వాత ఆ స్థాయి విజయం ఇంతవరకు ఈమెకు రాలేదు. వరుసగా ఈమె చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన చిత్రం పెంగ్విన్. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరవాలేదని పించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మిస్ ఇండియా.. ఈ సినిమా కూడా ఓటీటీలో ఇటీవల విడుదలై తుస్సుమంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రెండు సినిమాలు పెద్దగా అలరించలేపోయే సరికి కొంత అప్ సెట్‌లో ఉంది కీర్తి. ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం మహానటి సినిమా భారీ హిట్ ను ఇవ్వడంతో ఆ తర్వాత కీర్తి సురేష్ కథల ఎంపికలో క్లారిటీ లేకుండా వ్యవహరిస్తోందని అంటున్నారు. అందుకే ఆమె ఎంచుకున్న కథలు అట్టర్ ప్లాఫ్ గా మారాయంటున్నారు.  అయితే వరుస ప్లాపులను మూటగట్టకుంటున్న కీర్తి ఇక కొన్ని రోజుల వరకు లేడి ఒరియెంటెడ్ సినిమాకు బైబై చెప్పనుందట. ఒకవేళా మంచి స్క్రిప్ట్ దొరికితే తప్ప అలాంటి సినిమాలకు ఒప్పుకోకూడదని నిర్ణయం తీసుకుందట.

ఇక కీర్తిసురేష్ నటిస్తోన్న మరో లేడి ఒరియేంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏది ఏమైనా వరుసగా సినిమాలు ఇలా దెబ్బ కొడుతుంటే తట్టుకోలేకపోతుంది కీర్తి. ఆమె నుండి రాబోతున్న ఈ గుడ్ లక్ సఖి అయినా హిట్ అవుతుందో లేదో.. ఇక్కడ మరో విషయం ఏమంటే.. గుడ్ లక్ సఖి కూడా ఓటీటీలోనే విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కనిపించనున్నారు. కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

అది అలా ఉంటే.. కీర్తికి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పాటు దేవాకట్టా సినిమాలోను నటిస్తున్నాడు. వీటికి తోడు  మరో కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్.. నటించే అవకాశం ఉందని అంటున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు సాయితేజ్. స్టార్ డైరక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉంది చిత్రబృందం.

Keerthy Suresh photos, Keerthy Suresh new photos, Keerthy Suresh new pics, Keerthy Suresh photogallery, Keerthy Suresh with Mahesh babu, కీర్తి సురేశ్ కొత్త ఫోటోలు, కీర్తి సురేశ్ కొత్త పిక్స్, కీర్తి సురేశ్ ఫోటో గ్యాలరీ, మహేశ్‌ బాబుతో కీర్తి సురేశ్
కీర్తి సురేష్ Photo : Twitter

ఇక ఇప్పటికే కీర్తి సురేష్ తెలుగులో రంగ్ దే అనే మరో సినిమాను చేస్తుంది. నితిన్ హీరోగా చేస్తున్నాడు. రంగ్ దే సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. రంగ్ దేను సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్స్ వేస్తోందట చిత్రబృందం. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా జనవరి నుండి షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమాతో పాటు కీర్తి చిరంజీవి తమిళ రీమేక్ వేదాళంలో కూడా నటించనుంది. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలతో పాటు కీర్తి తమిళ్‌లో అన్నాత్తేలో కూడా నటిస్తోంది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో కీర్తి కీలకపాత్రలో నటిస్తోంది.

First published:

Tags: Chiranjeevi, Keerthy Suresh, Rajinikanth, Tollywood news

ఉత్తమ కథలు