కీర్తి సురేష్ అదృష్టం .. నిర్మాతలకు దురదృష్టంగా మారిందా..

కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. తాజాగా ఈమె అదృష్టం నిర్మాతలకు దురదృష్టంగా మారిందా.. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: September 26, 2019, 11:50 AM IST
కీర్తి సురేష్ అదృష్టం .. నిర్మాతలకు దురదృష్టంగా మారిందా..
కీర్తి సురేష్
  • Share this:
కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. తాజాగా ఈమె అదృష్టం నిర్మాతలకు దురదృష్టంగా మారిందా.. వివరాల్లోకి వెళితే..  ఇటు దర్శక, నిర్మాతలు.. అటు అగ్ర కథానాయకులే కాదు, యువతరం క్రేజీ హీరోలు కూడా తమ చిత్రాల్లో కీర్తి సురేషే వుండాలంటున్నారట.  ఒక్కసారి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాక కథానాయికల ప్రణాళికలు పూర్తిగా మారిపోతుంటాయి. కథ ఇలా ఉంటేనే ఒప్పుకోవాలని, చేసే క్యారెక్టర్‌కు ఇంత ప్రాధాన్యం ఉండాల్సిందే అనీ పట్టుపడుతుంటారు. అంతేకాదు పారితోషికం విషయంలోనూ అస్సలు తగ్గకూడదనీ.. ఇలా బోలెడన్ని లెక్కలు వేసుకొని అందుకు తగినట్టుగా తమ కెరీర్‌లో ప్రయాణం సాగిస్తుంటారు. ప్రతీసారీ తమలోని నటిని సంతృప్తిపరిచే పాత్రని చేయలేరు. చేసేందుకు సిద్ధంగానే వున్నా, ఆ తరహా పాత్రలు వారి దగ్గరికి రాకపోవచ్చు.

మహానటిలో కీర్తిసురేష్ (instagram)


చిత్రసీమలోకి అడుగుపెట్టే ప్రతి బ్యూటీ తన స్థానాన్ని టాప్ పొజిషన్‌లో చూసుకోవాలనే ఆరాటపడుతుంది. అందుకోసం ఎన్నో కలలు కూడా కంటుంది. కానీ, కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. అందం, అభినయానికి తోడు అదృష్టం కలిసిరావడంతో స్టార్ కథానాయిక రేంజ్‌కు ఎదిగింది కీర్తి. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోల చిత్రాల్లో నటిస్తోంది.నటించిన సినిమాలు తక్కువే అయినా కూడా కీర్తికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఫలితంగా దర్శక, నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేసేందుకు క్యూ కట్టారు. అందుకే కీర్తి ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది.

instagram


ఇప్పుడామె చేతిలో తెలుగు, తమిళంతో హిందీలో కూడా చేతినిండా సినిమాలున్నాయి. ఐతే ఇలా వచ్చినవి భారీ చిత్రాలు కావడం.. అగ్ర నటులతో జోడీ కట్టడం చకచకా జరిగిపోవడంతో ఇప్పుడామె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ప్రస్తుతం అన్నీ షూటింగ్ దశలోనే వున్న చిత్రాలు కావడంతో ఈ చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నానా రకాల ఇబ్బందులు పడుతోందిట. ఇప్పటికే చాలా మంది ఆయా సినిమాల దర్శక, నిర్మాతలు కీర్తి సురేష్ వల్ల అగ్ర హీరోల డేట్స్ వృథా అయిపోతున్నాయని ఫిర్యాదు కూడా చేస్తున్నారట. కీర్తి మాత్రం ఏం చేస్తుంది? తాను ఒప్పుకున్న చిత్రాలన్నీ షూటింగ్ మధ్యలోనే ఉండడంతో ఏం చేయలేక తికమక పడుతుందట. అడిగినంత పారితోషికం తీసుకుంటూ ఇలా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఏం బాగోలేదని నిర్మాతలు వాపోతున్నారట.

keerthy suresh got kerala state government award after national best actress award for mahanati movie,keerthy suresh national best actress,keerthy suresh,keerthy suresh mahanati,keerthy suresh got kerala cm pinarayi vijayan,kerala chief minister pinarayi vijayan gave award to keerthy suresh,keerthy suresh kerala state award,keerthy suresh ajay devgn maidaan,maidaan new keerthy suresh about biopics,keerthy suresh,keerthi suresh,keerthi suresh new movie,keerthi suresh movies,keerthi suresh national award,keerthy suresh speech,keerthy suresh latest news,keerthi suresh interview,keerthy suresh movies,telugu news,keerthy suresh best actress,keerthy suresh national award,keerthy suresh mahanati movie,keerthy suresh best actress 2019,keerthi suresh songs,latest news,national award for keerthy suresh,mahanati,mahanati movie,mahanati songs,mahanati full movie,mahanati movie songs,mahanati,mahanati trailer,mahanati savitri,mahanati success,mahanati making video,mahanati uncut scenes,mahanati audio launch,mahanati movie making video,mahanati movie collections,mahanati movie deleted scenes,mahanati edit,mahanati making,mahanati teaser,mahanati videos,mahanati review,women in mahanati,mahanati samantha,mahanati director,keerthy suresh,keerthi suresh,keerthy suresh best actress 2019,keerthy suresh movies,best actress 2019 keerthy suresh,keerthy suresh hot,actress keerthy suresh,keerthy suresh best actress,actress keerthi suresh,keerthi suresh national award,keerthy suresh speech,keerthy suresh interview,keerthi suresh best actress national award,keerthy suresh awards,keerthy suresh biography,mahanati actress keerthy suresh,gang leader,gang leader movie review,nani gang leader movie review,మహానటి,కీర్తి సురేష్,కీర్తి సురేష్ కొత్త సినిమా,కీర్తి సురేష్ అజయ్ దేవ్‌గణ్,కీర్తి సురేష్ అజయ్ దేవ్‌గణ్ మైదాన్ మూవీ ప్రారంభం,కీర్తి సురేష్ జాతీయ అవార్డు,కేరళ ప్రభుత్వ పురస్కారం అందుకున్న కీర్తి సురేష్,కీర్తి సురేష్ పినరయి విజయన్,పినరయి విజయన్,
కీర్తి సురేష్


కాల్షీట్స్ విషయంలో ఇబ్బందులు పెట్టొద్దని ప్రాధేయపడుతున్నారట. అయితే కీర్తి సురేష్ ఇలా చేయడం వల్ల కొత్త ప్రాజెక్టులలోకి ఈ అమ్మడిని తీసుకోవాలనుకున్న దర్శక, నిర్మాతలు ఇప్పుడు వేరే కథానాయికలని తమ చిత్రాల్లో ఎంపిక చేసుకునే పనిలో పడ్డారట. మంచి అవకాశాలు రావడంతో లెక్కకు మించి సినిమాలను ఒప్పుకోవడం వలనే ఈ కేరళ కుట్టికి ఇలాంటి కష్టాలు ఎదురవుతున్నాయంటున్నారు ఆమె సన్నిహితులు. ప్రస్తుతం కోటిన్నరకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న కీర్తి కెరీర్‌కు ఇలాంటి సంఘటనలు నష్టం కలిగిస్తాయన్న విషయాన్ని ఆమె గమనించాలన్నారు. లేకపోతే.. కీర్తి అత్యాశతో తీసుకున్న నిర్ణయాలే ఆమెను ఇలాంటి సందిగ్ధంలో పడేశాయని సినీ పెద్దలు అంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 26, 2019, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading