#HBDKeerthySuresh: అభిమానులకు కీర్తి సురేష్ పుట్టినరోజు కానుక..

Keerthy Suresh | మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పుట్టినరోజు కానుక అందజేసింది.

news18-telugu
Updated: October 17, 2019, 10:50 AM IST
#HBDKeerthySuresh: అభిమానులకు కీర్తి సురేష్ పుట్టినరోజు కానుక..
కీర్త సురేష్ (Twitter/Photo)
  • Share this:
రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్.. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. వాటితో పాటు తాజాగా కీర్తి.. నగేష్ కకునూర్ దర్శత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ రోజు కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.


స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నవంబర్ 11న నుంచి ఈ సినిమా చివరి షెడ్యూల్ జరగనుంది. దీంతో ఈ సినిమా పూర్తైవుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 17, 2019, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading