Keerthy Suresh : అదిరిన మిస్ ఇండియా ట్రైలర్.. కీర్తికి సాలిడ్ హిట్ దొరికినట్లే..

మిస్ ఇండియా ట్రైలర్ మిస్ ఇండియా: కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా ఇది. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా.

Keerthy Suresh Miss India Trailer : మహానటి తర్వాత కీర్తికి ఇంతవరకు సరైనా హిట్ లేదు.. అయితే ఈ తాజా సినిమా మిస్ ఇండియాతో మరోసారి ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకోనుంది.

  • Share this:
    కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరుగా రాణిస్తున్నారు. తెలుగు సినిమా 'మహానటి'తో స్టార్ స్టేటస్‌తో పాటు గొప్పనటిగా నిరూపించుకుంది కీర్తి. ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ పురస్కారం కూడ లభించింది. 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగా కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మిస్ ఇండియా సినిమాలో కీర్తి గతంలో ఎన్నడూ చేయని ఓ స్పెషల్ రోల్ చేస్తుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. మొదటి నుంచీ మంచి హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈ సారి కీర్తి సురేష్‌కు ఓటీటీలో సాలిడ్ హిట్ దొరికినట్టే అని అనిపిస్తోంది.



    ఇక ట్రైలర్‌ను చూస్తుంటే.. చిన్నప్పటి నుంచి ఉన్నతమైన కలలు కలిగిన అమ్మాయిగా కనిపించి కీర్తి పాత్ర కనిపిస్తోంది. అంతేకాదు అనుకున్నది సాధించే క్రమంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే సాధారణ అమ్మాయిగా కీర్తి పాత్రను డిజైన్ చేశారు. దీనికి తోడు ఈ ట్రైలర్‌లో ఆలోచింపదగ్గ డైలాగులు సీనియర్ నటుడు జగపతి బాబు కు కీర్తికి నడుమ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. మహేష్ కోనేరు నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో వచ్చే నవంబర్ 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మిగితా ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ, నదియా నటిస్తున్నారు.  మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నితిన్‌తో రంగ్‌దే అనే సినిమా చేస్తోంది. అటు తమిళ్‌లో కూడా కీర్తి అదరగొడుతోంది. కీర్తి సురేష్ రజనీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో కీలకరోల్‌ చేస్తోంది. మహేష్ సర్కారు వారి పాటలో కూడా కీర్తి హీరోయిన్‌గా చేస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: