హోమ్ /వార్తలు /సినిమా /

ఓటీటీ క్వీన్‌గా కీర్తి సురేష్.. మరో సినిమా అదే బాటలో..

ఓటీటీ క్వీన్‌గా కీర్తి సురేష్.. మరో సినిమా అదే బాటలో..

కీర్తి సురేష్ Photo : Twitter

కీర్తి సురేష్ Photo : Twitter

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 19న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలవుతున్నాయి. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకుండా డెరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. ఇక అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా డిజిటల్ మీడియా ద్వారా  విడుదలై ఓకే అనిపించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 19న విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడ మరో విశేషమేమంటే ఆమె నటించిన మరో తెలుగు చిత్రం 'మిస్ ఇండియా' నిర్మాత కూడా డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎప్రిల్ 17న విడుదల కావాల్సిఉండగా.. లాక్ డౌన్ కారణంగా విడుదలకాలేదు.  నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించాడు.


First published:

Tags: Aha OTT Platform, Amazon prime, Keerthi Suresh, Tollywood

ఉత్తమ కథలు