కీర్తి సురేష్ మిస్ ఇండియా డబ్బింగ్ మొదలు..

కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తున్నారు. 'మహానటి'తో స్టార్ స్టేటస్‌తో పాటు గొప్పనటిగా నిరూపించుకుంది.

news18-telugu
Updated: February 2, 2020, 12:37 PM IST
కీర్తి సురేష్ మిస్ ఇండియా డబ్బింగ్ మొదలు..
Twitter
  • Share this:
కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లల ఒకరుగా రాణిస్తున్నారు.'మహానటి'తో స్టార్ స్టేటస్‌తో పాటు గొప్పనటిగా నిరూపించుకుంది. ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ పురస్కారం కూడ లభించింది. 'నేను శైలజ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కీర్తి, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'మహానటి'కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగా కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మిస్ ఇండియా సినిమాలో కీర్తి గతంలో ఎన్నడూ చేయని ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మిస్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీంతో సినిమాకు సంబందించి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని నిర్మాత మహేష్ కోనేరు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మిస్ ఇండియా చిత్రానికి దర్శకుడు నరేంద్ర నాధ్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.


కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మిగితా ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ  నటిస్తున్నారు.  మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లుక్‌ను కీర్తి బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఆ లుక్‌లో కీర్తి సన్నగా మారి స్టైలీష్‌ లుక్‌లో అదరగొట్టింది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ పెంగ్విన్, గుడ్ లక్ సఖి, తెలుగులో నితిన్‌తో రంగ్‌దే అనే సినిమా చేస్తోంది. అటు తమిళ్‌లో కూడా కీర్తి అదరగొడుతోంది. కీర్తి సురేష్ రజనీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో కీలకరోల్‌ చేస్తోంది.

First published: February 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు