• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KEERTHY SURESH IN LOVE AND ANIRUDH RAVICHANDER AND PLANNING TO TIE THE KNOT THIS YEAR SAYS A REPORT SR

Keerthy Suresh : ప్రేమలో కీర్తి సురేష్.. త్వరలో పెళ్లి ప్రకటన.. వరుడు ఎవరో తెలిస్తే షాకే..

Keerthy Suresh : ప్రేమలో కీర్తి సురేష్.. త్వరలో పెళ్లి ప్రకటన.. వరుడు ఎవరో తెలిస్తే షాకే..

Keerthy Suresh in love Photo : Instagram

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

  • Share this:
    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి సురేష్ లవ్‌లో పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అంతేకాదు ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో రౌండ్లు చేస్తున్న ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ ఇద్దరు తమ పెళ్లి తేదీని అతి త్వరలోనే అభిమానులకు, శ్రేయోభిలాషులకు వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లిపై ఇలాంటీ పుకార్లు వైరల్ కావడంతో, అనిరుధ్, కీర్తి సురేష్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి నుండి ఈ పెళ్లి ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో ప్రస్తుతం నితిన్ రంగ్ దేలో నటిస్తోంది.

    ఈ సినిమాతో పాటు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తోన్న గుడ్ లక్ సఖిలో కూడా నటిస్తోంది. వీటితో కీర్తి సురేష్ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో సర్కారు వారి పాటలో కూడా నటిస్తోంది.

    Keerthy Suresh and Anirudh Photo : Twitter


    పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది.






    ఇక అనిరుధ్ విషయానికి వస్తే.. ఆయన తెలుగులో నితిన్ అఆతో పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి సంగీతం అందించాడు. వీటితో పాటు విక్రమ్ కుమార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్ లీడర్‌కు కూడా మంచి మ్యూజిగ్ ఇచ్చి ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు. ఇక ఆయన లేటెస్ట్‌గా విజయ్ మాస్టర్‌కు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు