జాతీయ పురస్కారం తర్వాత కీర్తి సురేష్‌కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు..

మహానటి సినిమాలో నటనకు కీర్తి సురేష్‌ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు గెలుచుకుంది. త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తి సురేష్ ఈ పురస్కారం అందుకోనుంది. ఈ అవార్డు అందుకోనే లోపే కీర్తి సురేష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 13, 2019, 1:06 PM IST
జాతీయ పురస్కారం తర్వాత కీర్తి సురేష్‌కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు..
మిస్ ఇండియా (నెట్ ఫ్లిక్స్): నవంబర్ 4
  • Share this:
పోయినేడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసిందా అనే రేంజ్‌లో నటించి మెప్పించింది. అంతేకాదు ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో నటనకు కీర్తి సురేష్‌ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు గెలుచుకుంది. త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తి సురేష్ ఈ పురస్కారం అందుకోనుంది. ఈ అవార్డు అందుకోనే లోపే కీర్తి సురేష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓనం పండగ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీర్తి సురేష్‌ను ఆ స్టేట్ పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఈ అవార్డును అందజేశారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో  అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ సరసన నటిస్తోంది. మరోవైపు ‘మిస్ ఇండియా’ టైటిల్‌తో మరో సినిమా చేస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 13, 2019, 1:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading