news18-telugu
Updated: August 15, 2020, 12:23 PM IST
కీర్తి సురేష్ Photo : Twitter
Keerthy Suresh : కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి ఇటీవల అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన చిత్రం పెంగ్విన్. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై పరవాలేదని పించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మిస్ ఇండియా.. ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదలకానుంది. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా ఈమె మరో లేడీ ఓరియంటెడ్ ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైంది.
ఈ టీజర్ చూస్తుంటే.. మహానటి తర్వాత కీర్తి సురేష్ మరోసారి తన నటనతో విశ్వరూపం చూపించింది. ముఖ్యంగా టీజర్లో ఓ సన్నివేశంలో నువ్వు రామారావు అయితే.. లక్ అంటే ఏమిటో తెలియని ఓ పల్లెటూరి అమ్మాయి.. ఏకంగా రైఫిల్ షూటింగ్లో పాల్గొని పతాకాలు గెలిచిందనేదే ఈ సినిమా స్టోరీ.ఈ టీజర్లో ఓ సన్నివేశంలో నేను సావిత్రి అంటూ మరోసారి మహానటి సినిమాను గుర్తుకు చేసింది కీర్తి సురేష్. ఈ చిత్రం టీజర్ ఆద్యంతం ఆకట్టకునేలా ఉంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్ఫణలో వస్తోన్న ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదలకానుందని సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 15, 2020, 12:22 PM IST