Home /News /movies /

KEERTHY SURESH GOOD LUCK SAKHI SHOOTING COMPLETED SR

Keerthy Suresh : కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి షూటింగ్ పూర్తి... ఓటీటీలో విడుదలకు రెడీ..

కీర్తి సురేష్ Photo : Twitter

కీర్తి సురేష్ Photo : Twitter

Keerthy Suresh : కీర్తి సురేష్ ఇటీవల అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. అందులో భాగంగా ఆమె నటించిన మరో చిత్రం గుడ్ లక్ సఖి.

    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటించనుందని తెలుస్తోంది. అది అలా ఉంటే కీర్తి ఇటీవల అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన చిత్రం పెంగ్విన్. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్‌లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరవాలేదని పించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మిస్ ఇండియా.. మహిళలపై జరిగే వేధింపుల నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదలకానుందని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి లేదట. మిస్ ఇండియాను డైరెక్ట్‌గా థియేటర్‌లోనే విడుదల చేస్తారట. ఈ సినిమాలతో పాటు కీర్తి సురేష్ మరో సినిమాలో నటిస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు.


    గుడ్ లక్ సఖి అంటూ వస్తున్న ఈ చిత్రానికి ఎక్కువగా మహిళలే పని చేస్తున్నారట. ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలకానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కనిపించనున్నారు. కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  తాజా సమాచారం మేరకు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదలకానుందని సమాచారం. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఇటీవల ప్రభుత్వం కొన్ని సడలింపులతో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వగా దర్శకుడు నగేష్ మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేశాడట. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఓటీటీలో విడుదల చేయనున్నారట.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Keerthy Suresh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు