Home /News /movies /

KEERTHY SURESH GOOD LUCK SAKHI MOVIE TO RELEASE ON JANUARY 28TH HERE ARE THE DETAILS SR

Keerthy Suresh : కీర్తి సురేష్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ శుభ తరుణం రానే వచ్చింది..

Keerthy suresh Instagram

Keerthy suresh Instagram

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్‌బాబుకు జోడిగా (Sarkaru Vaari Paata) సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నాని హీరోగా వస్తున్న దసరాలోను నటిస్తున్నారు. అది అలా ఉంటే కీర్తి నటిస్తున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం (Good Luck Sakhi) గుడ్ లక్ సఖి.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసారు. షూటింగ్ పూర్తి చేసుకన్న ఈ సినిమా మొన్నటి వరకు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాను మేకర్స్ థియేట్రికల్ రిలీజ్  చేస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 28 న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

    ఇక ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు U సర్టిఫికేట్ జారీ చేసారు. ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. కీర్తి సురేష్‌ టైటిల్‌ పాత్రలో వస్తున్న ఈ సినిమాకు నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించగా.. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే... మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.  ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.


    ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఈ రెండు సినిమాలతో పాటు కీర్తి తెలుగులో మరో సినిమాలోను నటిస్తున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న దసరా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    Ala Vaikuntapuramulo: అల వైకుంఠపురములో హిందీ వర్షన్ మూవీ రిలీజ్ లేనట్టే ?.. అదే అసలు కారణం ?

    వీటితో పాటు కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషల్లో ఎలా ఆకట్టుకోనుందో..
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Keerthy Suresh, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు