Home /News /movies /

Keerthy Suresh - Good Luck Sakhi : సెన్సార్ పూర్తి చేసుకున్న కీర్తీ సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మూవీ..

Keerthy Suresh - Good Luck Sakhi : సెన్సార్ పూర్తి చేసుకున్న కీర్తీ సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మూవీ..

సెన్సార్ పూర్తి చేసుకున్న కీర్తి సురేష్ (Twitter/Photo)

సెన్సార్ పూర్తి చేసుకున్న కీర్తి సురేష్ (Twitter/Photo)

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈమె నటించిన ‘గుడ్‌ లక్ సఖి’ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

    Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్‌బాబుకు జోడిగా (Sarkaru Vaari Paata) సర్కారు వారి పాటలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నాని హీరోగా వస్తున్న దసరాలోను నటిస్తోంది. అది అలా ఉంటే కీర్తి నటిస్తున్న మరో చిత్రం (Good Luck Sakhi) గుడ్ లక్ సఖి.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసారు. షూటింగ్ పూర్తి చేసుకన్న ఈ సినిమా మొన్నటి వరకు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాను మేకర్స్ థియేట్రికల్ రిలీజ్  చేస్తున్నారు.

    డిసెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు U సర్టిఫికేట్ జారీ చేసారు. ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.


    కీర్తి సురేష్‌ టైటిల్‌ పాత్రలో వస్తున్న ఈ సినిమాకు నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించగా.. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలో వస్తుండగా.. కీర్తి షూటర్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Bangarraju : నాగ చైతన్య ‘బంగార్రాజు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్..

    ఇక కీర్తి సురేష్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే... మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది.

    Balakrishna - Unstoppable NBK: చేతికి కట్టుతో మూడో ఎపిసోడ్‌కు గెట్ రెడీ అంటోన్న బాలకృష్ణ..

    ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఈ రెండు సినిమాలతో పాటు కీర్తి తెలుగులో మరో సినిమాలోను నటిస్తున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న దసరా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    Kalyan Ram - Bimbisara: ఎవరీ బింబిసార..? ఏంటి చరిత్ర..?.. ఆసక్తిరేకిస్తోన్న కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్..

    వీటితో పాటు కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషల్లో ఎలా ఆకట్టుకోనుందో..
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Good Luck Sakhi, Keerthy Suresh, Sarkaru Vaari Paata, Tollywood

    తదుపరి వార్తలు