Home /News /movies /

KEERTHY SURESH GOOD LUCK SAKHI FIRST DAY COLLECTIONS SR

Keerthy Suresh | Good Luck Sakhi Collections : కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..

Keerthy Suresh Good Luck Sakhi first day Collections Photo : Twitter

Keerthy Suresh Good Luck Sakhi first day Collections Photo : Twitter

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఆమె తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం (Good Luck Sakhi) గుడ్ లక్ సఖి.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 28న విడుదలైంది.

ఇంకా చదవండి ...
  Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఆమె తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం (Good Luck Sakhi) గుడ్ లక్ సఖి.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 28న విడుదలైంది. ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు దీనికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే జరిగాయి. అయితే ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత బజ్ క్రియేట్ చేయలేక పోయిందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజు నుండే టాక్ పరంగా కంప్లీట్ గా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు నైజాంలో 5 లక్షలు, సీడెడ్ లో 2 లక్షలు టోటల్ ఆంధ్రలో 6 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో 13 లక్షల రేంజ్ లో షేర్‌ను అందుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు అయిన బిజినెస్ ప్రకారం గుడ్ లక్ సఖి కనీసం 2.5 కోట్లు అయిన కలెక్ట్ చేయాల్సి ఉందట. చూడాలి మరి లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో..

  ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఎక్కడో మారుమూల గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్‌గా ఎలా మారిందనే కథాంశం. తాను పెరిగిన ఊర్లో కీర్తి సురేష్ అందరికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతోదనేది వారి నమ్మకం. ఆడవాళ్లకు షూటింగ్ ఎంటని ఎగతాళి చేస్తుంటారు. మరి అందరిచే ‘బ్యాడ్ లక్ సఖి’ అనిపించుకున్న కీర్తి సురేష్ అందరిచే ‘గుడ్ లక్ సఖి’ అనిపించుకుందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్‌రాజు సమర్పించారు.

  F3 Movie : షూటింగ్ పూర్తి చేసుకున్న ఎఫ్ 3.. సమ్మర్‌లో నవ్వుల పండుగ..

  ఇక కీర్తి సురేష్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్‌బాబుకు జోడిగా (Sarkaru Vaari Paata) సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నాని హీరోగా వస్తున్న దసరాలోను నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌కు జోడిగా నాగ శౌర్య నటిస్తున్నట్టు సమాచారం.

  Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానాల భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మరోసారి మారనుందా..

  ఈ సినిమాలతో పాటు కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషల్లో ఎలా ఆకట్టుకోనుందో..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Good Luck Sakhi, Keerthy Suresh, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు